ఒలంపిక్స్ లో పతకం సాధించేందుకు బాలివుడ్ నటి ప్రియాంక చోప్రా బాక్సింగ్ నేర్చుకుంటోంది. పిడిగుద్దులతో పతకం సాదిస్తుందో లేదో తెలియదు కాని ఒంపు సొంపులతో ప్రత్యర్థిన మైకంలో పడేసి ఆతర్వాత గుద్దిన గుద్దు గుద్దకుండా గుద్ది భారత్ కు ఒలంపిక్ మెడల్ తెస్తుంది అని సంబర పడకండి.

నిజంగా ఒలంపిక్స్ లో పతకం సాధించాడానికే ప్రియాంక బాక్సింగ్ నేర్చుకుంటున్నా... ఆ ఒలంపిక్ క్రీడలు నిజమైనవి కావు, ఆమె నటిస్థున్న సినిమాలోని ఒలంపిక్స్ క్రీడల కోసం ఈ నిజమైన ప్రాక్టీస్ చేస్థూ తెగ కష్టపడుతోందట ప్రియాంక. ఇంట్లో ప్రాక్టీస్ కోసం పంచింగ్ బ్యాగ్ వేలాడతీస్తే  రూంలోని పైకప్పులో ఉన్న అలంకరణలు పాడవుతున్నాయట పాపం.

ఒలంపిక్స్ లో పతకం సాధించిన క్రీడాకారిణి మేరికోం జీవితం ఆదారంగా సంజయ్ లీలా బన్సాల్ ప్రియాంక చోప్రా ప్రధాన నాయికగా ఈచిత్రం నిర్మిస్థున్నారు. పాత్రలో జీవించడానికి ఈ బాలివుడ్ సుందరి బాక్సింగ్ నేర్చుకుంటోందన్న మాట. పాత్రలో జీవిస్థుందా, సినిమాలోని మిగిలిన సన్నివేశాల్లో వయ్యారాలు ఒలకపోసి ప్రేక్షకుల మదిని దోచుకుని ఓ హిట్ సినిమా అందిస్థుందా అంటే కాస్తా ఆగాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: