‘డాలర్ డ్రీమ్స్’ సినిమా తీసినప్పుడు ఆయన పేరు ఎవ్వరికీ తెలియదు తరువాత ఒక మంచి కాఫీ లాంటి సినిమా అంటూ ‘ఆనంద్’ సినిమా తీసాడు, అంతే ఆ ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఆతరువాత కాలేజీ జీవితం నేపధ్యంలో ‘హ్యాపీ డేస్’ సినిమా ఈయన క్రియేటివిటీని హిమాలయాల పై కూర్చోపెట్టింది. మరి కొన్నాళ్ళకు దేశాన్ని తినేస్తున్న రాజకీయ అవినీతి పై సినిమాగా ‘లీడర్’ ను తీస్తే జనానికి అంతగా నచ్చలేదు. ఇక లాభం లేదు అనుకుని, తనకు కలిసి వచ్చిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ కధాంశాన్నే కొద్దిగా మార్పులు చేర్పులూ చేసి క్రితం సంవత్సరం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ గా వస్తే ఆ సినిమాను చూసిన అందరూ షాక్ అయ్యారు.

 గతంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా ను కొద్దిమార్పులతో మళ్ళీ తీసినట్లు గా ఉంది అన్నారు. ఇక లాభం లేదు అనుకుని క్రియేటీవ్ దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్మల చాలా మంది ప్రముఖ దర్శకులలాగే  రూట్ మార్చి ‘కహానీ’ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ప్రస్తుతం స్పీడ్ గా రీమేక్ చేస్తున్నారు. కాపి అండ్ పేస్ట్ లా తీయగలిగే రీమేక్ సినిమా వైపు శేఖర్ కమ్మల లాంటి వాళ్ళు కూడా పరుగు తీయడం, సేఫ్ గేమ్ అనుకోవాలా లేదా ఆయన క్రియేటీవిటీ తగ్గింది అనుకోవాలా అనే టాక్ ఫిలింనగర్ లో వినపడుతోంది...    

మరింత సమాచారం తెలుసుకోండి: