ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌నున్న గ‌బ్బర్ సింగ్2  ప్రీ  ప్రొడ‌క్షన్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.  గ‌బ్బర్ సింగ్ భీభ‌త్సమైన హిట్ అయిన కార‌ణంగా మ‌ళ్లీ ఆ రేంజ్ కొట్టాల‌ని ప‌వ‌న్ త‌హ‌త‌హాలాడుతున్నాడు. దీంతో డైరెక్టర్ సంప‌త్ నంది గ‌బ్బర్ సింగ్2 ని చాలా ప్రత్యేక‌త‌లతో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. విశేషం ఏంటంటే   ఈ సినిమాకు సంబందించి రోజుకో న్యూస్ ఫిల్మ్ న‌గ‌ర్ లో హాట్ హాట్ గా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి ఐటం గ‌ర్ల్ దొరికింద‌ట‌. గ‌బ్బర్ సింగ్ లో కెవ్వుకేక సాంగ్ కోసం బాలీవుడ్ నుండి మ‌లైకా అరోరాని దిగుమ‌తి చేశారు. ద‌బాంగ్ లో మున్నీ బ‌ద్నామ్ హుయి అంటూ అక్కడ ఆడినా ఈ సుంద‌రి ఇక్కడ కెవ్వుకేక‌లో త‌న అందంతో కేక పెట్టించింది.
ఇక ద‌బాంగ్ 2లో ఫెవికాల్ సే అంటూ బెబో క‌రీనాక‌పూర్ కుర్రకారుని హీటెక్కించింది.  దబాంగ్ భామ‌ను గ‌బ్బర్ సింగ్ లో ఆడించిన‌ట్టే....దబాంగ్2  ఐటం బాంబ్ ని గ‌బ్బర్ సింగ్2లో చిందేపిద్దామాని ప్లాన్ చేశార‌ట సంప‌త్ నంది. కానీ బెబో రెమ్యూన‌రేష‌న్ తో ఓ చిన్న పాటి సినిమా చేయోచ్చు. దీంతో ఆమె ప్లేస్ లో  యాంక‌ర్ రోచెల్లి మారియా రామ్ ని ఎంపిక చేశార‌ట‌.
ఐపిఎల్ -6లో త‌న అందాల‌ను ఆర‌బోసి బుల్లితెర ప్రేక్షకుల‌ను విప‌రీతంగా ఎట్రాక్ట్ చేసిన ఈ హాట్ యాంక‌ర్ ప‌వ‌న్ స‌ర‌స‌న ఐటం బామ‌గా చిందేయ‌బోతుంది. అయితే అందాల‌ను ఆర‌బోయ‌డం వ‌ర‌కు ఒకే....కానీ ఐటం సాంగ్ అంటే డాన్స్ వేయాలిక‌దా...? మ‌రి  గ‌బ్బర్ సింగ్2లో   రోచెల్లి మారియా ఏ రేంజ్ స్టెప్స్ వేస్తుందో జ‌స్ట్ వెయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: