ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఎవరి సత్తాను వారు చాటుతున్న ప్రిన్స్ మహేష్ లు ఒక విషయంలో మాత్రం చేతులు కలిపారు. అదే వారి బాడీ సిక్స్ పేక్ విషయంలో, ప్రిన్స్ టాలీవుడ్ కోసం, చెర్రీ బాలీవుడ్ కోసం బాడీ ని పెంచి తమ షర్ట్ లను విప్పతీసి మేన్ లీ హీరోలుగా కనపడటానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే 40 కోట్ల రికార్డులను సొంతం చేసుకున్న వీరిద్దరూ బాలీవుడ్ లో 100 కోట్ల రికార్డు పై కన్ను వేసారు. ఈ సమ్మర్ తరువాత రిలీజ్ కాబోతున్న చెర్రీ ‘జంజీర్’ ఇప్పుడు ఆ సినిమా కున్న క్రేజ్ రీత్యా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అనీ, చెర్రీ ని అనుసరిస్తూ బాలీవుడ్ ఎంట్రీకి తయరైపోతున్న మహేష్ కూడా చెర్రీ కి సమఉజ్జీగా ‘గో గోవా గాన్’ సినిమా తీసిన డి.కే. దర్శకత్వంలో తాను కూడా బాలీవుడ్ 100 కోట్ల క్లబ్ పై కన్ను వేసాడు.
వీరిద్దరూ ఇలా చేతులు కలిపి బాలీవుడ్ ను దోచుకుందా మన్న ఆలోచన బాగుంది కానీ, వీరికంటే సీనియర్లు కండల వీరులుగా పేరుగాంచిన సల్మాన్, జాన్ అబ్రహేమ్ లు మన టాలీవుడ్ యంగ్ హీరోలకు 100 కోట్ల క్లబ్ లో వీరికి అవకాశం ఇస్తారా అన్నదే ప్రశ్నార్ధకం. దీనినిబట్టి చూస్తే ప్రిన్స్ – చెర్రీలు ఒకరితో ఒకరు పోటీ పడుతూనే, మరొక వైపు చేతులు కలిపీ బాలీవుడ్ లో టాలీవుడ్ హీరోల అవతార్-2 చూపెట్ట బోతున్నారు.... 

మరింత సమాచారం తెలుసుకోండి: