జెనీలియా తెలుగువారికి హాసినిగా బాగా పరిచయం. రితేష్ ను పెళ్ళి చేసుకున్నాక ఈమె దాదాపు సినిమాలకు దూరమైంది. కానీ సినిమాలకు, పెళ్ళికి సంబంధం లేదని, మంచి సినిమాలు వస్తే తాను నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తోంది. రితేష్ తో తాను ప్రేమలో ఉన్నప్పుడు కూడా తాను సినిమాల్లో యాక్ట్ చేశానని, తను యాక్ట్ చేయడం పట్ల తన భర్తకు ఎలాంటి అసంతృప్తి లేదని అంటోంది జెన్నీ. ఏదేమైనా తెలుగువారి హాసిని జెనీలియా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఆమెకు మనసారా హ్యాపీబర్త్ డే చెప్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: