ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన క‌థానాయిక శ్రీ‌దేవి. సెకండ్ ఇన్నింగ్స్‌తో ఇండ‌స్ట్రీని తిరిగి ఏలుదామ‌నుకున్న అతిలోక సుంద‌రికు అంత ఓపిక లేదంట‌. కెరియ‌ర్ స్టార్టింగ్‌లో అయితే డే షిప్ట్‌లు, నైట్ షిప్ట్‌లు తీరిక లేకుండా చేసిన శ్రీదేవికు, సెకండ్ ఇన్నింగ్స్ సో సోగా వెళుతుంది.

ముఖ్యంగా ఇప్పుడు వీకెండ్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది. లేటెస్ట్‌గా బోణిక‌పూర్‌తో నాసిక్ వెళ్ళిన శ్రీదేవి ఇలా స్టిల్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ స‌మ్మర్ ఫినిష్ అయ్యే లోపు మ‌రికొన్ని వీకెండ్ ట్రిప్స్‌ను ప్లాన్ చేసుకుంద‌ట‌.

advertisements - Call 040 4260 1008


అయితే తెలుగులో వ‌స్తున్న బాహుబ‌లి మూవీలో త‌ల్లి క్యారెక్టర్ చేస్తుందంటు వ‌చ్చిన గాసిప్‌ శ్రీదేవి వ‌ర‌కు వెళ్ళిందో లేదో గాని, త్వర‌లోనే శ్రీదేవి హైద‌రాబాద్‌కు రాబోతుంద‌ని స‌మాచారం. బ‌హుశా ఈ ట్రిప్‌కు వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైమైనా వీకెండ్స్‌లో భ‌ర్త బోణిక‌పూర్‌తో తెగ ఎంజాయ్ చేస్తుంది శ్రీదేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: