మాంగ్టే చుంగ్నీజాంగ్‌ మేరి కోమ్ అంటే గుర్తుప‌ట్టడం కొంచెం క‌ష్టమే. ఇండియ‌న్ బాక్స్‌ర్ మేరి కోమ్ అంటే తెలియ‌ని వాళ్ళు ఎవ‌రూ ఉండ‌రు. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌ షిప్ పోటీలో పాల్గొని ప్రతీ పోటిలో పతకాన్ని సాధించిన తొలి బాక్సర్ మేరికోమ్‌. ప్రియాంక కండ‌లు బ‌రువెక్కడానికి మేరికోమ్ స్పూర్తే కార‌ణం.

మేరికోమ్ కెరియ‌ర్‌ను అనుస‌రించి వ‌స్తున్న సిల్వర్‌స్క్రీన్ మూవీలో మేరికోమ్ పాత్రను ప్రియాంక చోప్రా లీడ్ చేస్తుంది. ఈ మూవీ కోసం ప్రియాంక‌చోప్రా జిమ్‌లో క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టింది. బాక్సింగ్ నేప‌ధ్యంలో కొన‌సాగే ఫిల్మ్ కావ‌డంలో ప్రియాంక‌చోప్రాకు కండ‌లు కంప‌ల్సరి అవుతున్నాయి. భ‌ర్ఫీ,క‌మ్నే మూవీల్లో జీరో సైజ్ మెయిన్‌టెన్ చేసిన ప్రియాంక‌కు కండ‌లు పెంచ‌టం కొంచెం ఇబ్బందిగానే మారింద‌ట‌. కాని లెజండ్రి ప‌ర్సనాలిటి మూవీ కోసం చాలా క‌ష్టప‌డుతున్నానని చెప్పుకొచ్చింది.

ఈ మూవీను భ‌న్సాలి డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ నుండి ఈ ప్రాజెక్ట్‌ను ప్లోర్స్ మీద‌కు తీసుకువెళ్ళటానికి షెడ్యూల్స్ జ‌రుగుతున్నాయి. బాలీవుడ్ హీరోయిన్స్‌లో మొద‌టిసారిగా కండ‌లు పెంచుకుంటున్న హీరోయిన్ ప్రియాంక‌చోప్రానే.

మరింత సమాచారం తెలుసుకోండి: