అల్లు అర్జున్ - పూరి జ‌గన్నాథ్‌ల క్రేజీ కాంబినేష‌న్ ఇద్ద‌ర‌మ్మాయిల‌తో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇది ల‌వ్ స్టోరీనా?  థ్రిల్ల‌రా?  లేదంటే పూరి శైలిలో ఉండే యాక్ష‌న్ కామెడీనా??  అనేది ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. బ‌న్నీ మాత్రం ఈ సినిమాపై బాగా కాన్పిడెన్స్ గా ఉన్నాడు. పూరి క‌ల‌యిక‌లో మ‌రో హిట్టు కొట్ట‌డం ఖాయ‌మ‌ని ధీమాగా చెబుతున్నాడు. ముఖ్యంగా ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ఊహించ‌ని ట్విస్టుతో ఉంటుంద‌ట‌.

అలాగే, విశ్వ‌స‌నీయ వ‌ర్గాల సమాచారం ప్ర‌కారం తెలిసిందేమిటంటే... ఇద్ద‌ర‌మ్మాయిల‌తో ఓ ట్రాజ‌డీ స్టోరీ అట‌. త‌న ప్రేయ‌సిని పోగొట్టుకొన్న ఓ ప్రియుడు ఎలా ప్ర‌తీకారం తీర్చుకొన్నాడు..?  అనేదే ఈ సినిమా క‌థ అట‌. కొన్ని స‌న్నివేశాల్లో ప్రేక్ష‌కుల క‌ళ్లు చ‌మ్మ‌గిల్లుతాయ‌ట‌. పూరి ఈ త‌ర‌హా స‌బ్జెక్టుని డీల్ చేయ‌డం మాత్రం నిజంగా కొత్తే. మ‌రి ఎంత వ‌ర‌కూ న్యాయం చేశాడో??

మరింత సమాచారం తెలుసుకోండి: