మిస్టర్ ఫ‌ర్‌ఫెట్ మార్కెట్ స్టామినా ఏంటో మ‌రోసారి స‌త్తా చాటింది. బాలీవుడ్‌లో ఖాన్ ల మ‌ధ్య ఎప్పుడూ పోటీ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా కింగ్‌ఖాన్ షారుఖ్‌, అమిర్ ఖాన్ ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోటీ జ‌రుగుతుంది. ఓ ప‌క్క అమీర్‌ఖాన్ నెం.1 ప్లేస్ మీద కూర్చుంటే, ఇంత‌లోనే షారుఖ్ నేనే నెం.1 అంటూ వివాద‌స్పద వాఖ్యల‌ను చాలా సందార్భాల్లో చేశాడు.

అయితే షారుఖ్ న‌టించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీ రిలీజ్‌కు ద‌గ్గర‌ప‌డ‌టంతో ఈ మూవీకు అనూహ్యరీతిలో బిజినెస్ జ‌రిగింది. చైన్పై ఎక్స్‌ప్రెస్ శాటిలైట్ రైట్స్ 55 కోట్లకు అమ్ముడుపోయింది. ఇదే ఇప్పటి వ‌ర‌కూ బాలీవుడ్‌లో అమ్ముడ‌యిన‌ టాప్ శాటిలైట్ రైట్స్ మూవి. జ‌బ్‌త‌క్ హై జాన్ మూవీలో క‌త్రినాకు ఇచ్చిన హాట్ లిప్ లాక్ త‌రువాత‌, మ‌ళ్ళీ ఈ మూవీలోనే దీపికాకు మ‌రో హాట్ లిప్ లాక్ ఇచ్చేస్తున్నాడు షారుఖ్‌.

చైన్నైఎక్స్‌ప్రెస్ మూవీకు ఏ మాత్రం త‌గ్గకుండా అమీర్‌ఖాన్ న‌టిస్తున్న ధూమ్ 3 మూవీ శాటిలైట్ రైట్స్ 75 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో షారుఖ్‌కు త‌న స‌త్తా మ‌రో సారి రుచి చూపించాడు అమీర్‌ఖాన్‌. ఇంత ఎక్కువ మొత్తంలో శాటిలైట్ బిజినెస్ జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. దూమ్ 3 అమీర్ నెగిటివ్ రోల్ చేస్తుండ‌టంతో ఈ మూవీ ఎక్కడ లేని హైప్ పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: