ఎంతో ఘనంగా ప్రారంభం అయిన అల్లు అర్జున్ కెరీర్ ఇప్పుడు క్లిష్ట పరిస్థితులలో వుంది. వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ఆర్య-2, వరుడు, బద్రినాథ్ చిత్రాలు నిరాశ పరిచాయి. ఇప్పుడు తాజాగా జులాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం అతను ఎంతో కష్టపడ్డాడు. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో తనకు పూర్వవైభవం వస్తుందని నమ్మకంగా ఉన్నాడు. కాగా, సినిమా పరిశ్రమలోని వారికి సెంటిమెంట్లు ఎక్కువనే తెలిసిందే. వరుస విజయాలతో దూసుకు పొతున్న అల్లు అర్జున్ కు వివాహం కలసి రాలేదని కొంత మంది అంటున్నారు. అయితే జులాయి సినిమా హిట్ అయి స్నేహరెడ్డి మీద ఉన్న అపవాదు తొలగిపొతుందని మెగా ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: