స‌మంత తో సినిమా చేయాల‌ని పెద్ద  హీరోలంతా ఆశ ప‌డుతున్న త‌రుణం ఇది. బ‌డా నిర్మాణ సంస్థ‌లు ఆమె కాల్ఫీట్ల కోసం ఎదురుచూస్తుంటాయి. స‌మంత కూడా కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌లేక ఎన్నో సినిమాల్ని వ‌దులుకొంది. అయితే ఆమె దృష్టి స‌డ‌న్‌గా చిన్న సినిమాల‌పై ప‌డింది. ఆస‌క్తిక‌ర‌మైన‌ స్ర్కిప్టు వ‌స్తే చిన్న సినిమాల్లోనూ న‌టిస్తా... అని ప్ర‌క‌టించింది స‌మంత‌. స‌డ‌న్‌గా స‌మంత త‌న మ‌న‌సు మార్చుకొందేమిటి?  

అని అంద‌రూ ముక్కున వేలేసుకొంటున్నా.. దానికీ ఓ కార‌ణం ఉంది.ఇటీవ‌ల స‌మంత పిజ్జా అనే సినిమా చూసింది. ఈ థ్రిల్ల‌ర్ సినిమా స‌మంత‌కు బాగా న‌చ్చింది. అలాంటి క‌థ ఉంటే చెప్పండి. త‌ప్ప‌కుండా చేస్తా అని ద‌ర్శ‌కుల‌ను అడుగుతోంద‌ట‌. చిన్న సినిమాల్లో పారితోషికం త‌క్కువ ఇస్తారు క‌దా?  అంటే ``అన్ని సినిమాల‌నూ డ‌బ్బుల కోసం చేయకూడ‌దు

. ఒక‌వేళ ఆ సినిమా హిట్ట‌యితే ఆ  కెరీర్‌కే ప్ల‌స్ క‌దా?  ఆ త‌ర‌వాత సినిమాల్లో పారితోషికం ఎలాగూ పెరుగుతుంది`` అని లాజిక్ తీస్తోంది.అస‌లు విష‌యం మ‌రోటి కూడా ఉంది. ఎప్పుడూ పాట‌లు, రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించ‌డం స‌మంత‌కు బోర్ కొట్టేసుంటుంది. అందుకే కొత్త‌గా ట్రై చేద్దాం అనుకొంటోంది. మ‌రి స‌మంత కోరిక తీర్చేది ఎవ‌రో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: