రాజకీయాలలో శాశ్విత శత్రువులు మిత్రులు కలకాలం ఉండరు అన్న విషయాన్ని ఒకనాటి హీరోయిన్ రోజా నిజం చేస్తూ ఇప్పుడు ఏకంగా రేపు విడుదల కాబోతున్న ‘ఖైదీ నెంబర్ 150’ ని ప్రమోట్ చేయడం ఈరోజు టాపిక్ ఆఫ్ ది డేగా మారింది.  తన ‘ఖైదీ’ ప్రమోషన్ కోసం అన్ని చానల్స్ కు వరస పెట్టి ఇంటర్వ్యూలు యిస్తూ సందడి చేస్తున్న చిరంజీవి ప్రముఖ న్యూస్ ఛానల్ సాక్షి కోసం ఇచ్చిన ఇంటర్వ్యూని రోజా నిర్వహించడం అందరూ ఆశ్చర్య పడేలా చేసింది. 

చిరంజీవిని అదేవిధంగా మెగా ఫ్యామిలీని ఎన్నో సార్లు టార్గెట్ చేసిన రోజా ఆ విషయాలు అన్నీ మరిచిపోయి నవ్వుతూ చిరంజీవిని ఇంటర్వ్యూ చేయడమే కాకుండా ‘ఖైదీ’ మూవీ గురించి ప్రశంసలు కురిపించడం చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయ్యే వ్యవహారంలా మారింది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన సాక్షి ఛానల్ ఈకార్యక్రమం నిర్వహించడానికి ఎందరో యాంకర్లు తమ ఛానల్ లో ఉన్నా ప్రత్యేకంగా రోజాని రంగంలోకి దింపడం వెనుక టి ఆర్ పి రేటింగ్స్ కోసమా లేదంటే ఈ వ్యవహారం వెనుక ఏదైనా ఎత్తుగడలు ఉన్నాయా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

‘ఖైదీ’ ప్రమోషన్ పీక్ కు చేరిపోవడంతో రేపు విడుదల కాబోతున్న ఈమూవీ క్రేజ్ ను మరింత పెంచడానికి ఈ ఇంటర్వ్యూ మరింత సహకరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వైసీపీ ఎమ్మెల్యే గా ‘జబర్దస్త్’ ఫేమ్ ఆ సీనియర్ హీరోయిన్ గా ఎంతో చరిష్మావున్న రోజా చాల సహజంగా తన బాధ్యతను నిర్వహిస్తూ ఈ ఇంటర్వ్యూను చాల సమర్ధవంతంగా నిర్వహించింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

గతంలో చిరంజీవితో కొన్ని సినిమాల్లో నటించిన రోజా చిరంజీవి పక్కన హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది. రాజకీయాల బాట పట్టి సినిమాలకు దూరం అయిన రోజా 10 ఏళ్ల తరువాత తిరిగి హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న చిరంజీవిని పెద్దగా ఇరుకున పెట్టే ప్రశ్నలు అడగకుండా ‘ఖైదీ’ మ్యానియాకు తన వంతు సహాయం కూడ చేసింది రోజా..   



మరింత సమాచారం తెలుసుకోండి: