మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చి పండుగ చేసుకుంటూ ఉంటే ఈసినిమాకు మాతృక అయిన ‘కత్తి’ తమిళ సినిమాకు స్క్రిప్ట్ అందించిన ప్రముఖ డైరెక్టర్ మురగదాస్ కు ‘ఖైదీ నెంబర్ 150’ ఏమాత్రం నచ్చలేదు అని వార్తలు వస్తున్నాయి.  మొదటి నుంచి చిరంజీవి స్థాయికి ఏమాత్రం సరిపోని ఈ ‘కత్తి’ రీమేక్ వ్యవహారం పట్ల మురగదాస్ అసంతృప్తిగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.

‘కత్తి’ సినిమాకు కత్తిలాంటి స్క్రిప్ట్ సమకూర్చిన డైరక్టర్ మురుగదాస్ ఈ సినిమా తమిళ మాతృకకు సంబంధించి కమర్షియల్ హంగులతో పాటు, మంచి పొటెన్షియాలిటీ, ఎమోషనల్ కేలిబిర్ తో కూడిన స్క్రిప్ట్ ను అందించాడు. ‘కత్తి’ సినిమా సూపర్ సక్సస్ కు ఆ సినిమా ఇంటర్వెల్ తరువాత వచ్చే బరువైన సెకండ్ ఆఫ్ సన్నివేశాలు బాగా సహకరించాయి.

నిన్న విడుదలైన ‘ఖైదీ నెంబర్ 150’ ని మురుగదాస్ తొలి రోజే హైదరాబాద్ లో చూసినట్లు తెలుస్తోంది. మహేష్ సినిమా పని నిమిత్తం హైదరాబాద్ లో ఉన్న మురగదాస్ ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలోని కామెడీ ట్రాక్ చూసి మురుగదాస్ చాలా ఫీలయినట్లు తెలుస్తోంది. దీనికి ఒక ఆసక్తిగల కారణం వినిపిస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు మురుగదాస్ కు లిక్కర్ అంటే ఇష్టం ఉండదు. అందువల్లనే అతడు తీసే సినిమాలలోని పాత్రలు కూడ లిక్కర్ ను ముట్టుకోవు.  ఆఖరికి ‘తుపాకి’ సినిమాలో విలన్ ని కూడా గ్రీన్ టీ తాగుతున్నట్లు చూపించాడు మురుగదాస్. 

అయితే ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో హీరో కు కమెడియన్ కు మధ్య ట్రాక్ మధ్య అంతా లిక్కర్ తోనే నడవడం చూసి మురగదాస్ షాక్ అయి చిరంజీవి లాంటి ఇమేజ్ ఉన్న నటుడు ఇలాంటి సీన్స్ లో కమెడియన్ తో ఎలా నటించాడు అంటూ తనతో ఆ సినిమాను చూస్తున్న వారితో తన అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.  అదే విధంగా ఆలీకి ఆడవేషం వేయడం పై కూడా ఇదేం కామెడీ, మరింకేదైనా ఆలోచించవచ్చు కదా అని మురగదాస్ ఫీలయినట్లు టాక్. ఎంతో ఉదాత్తంగా తీయవలసిన ‘ఖైదీ’ మూవీ సెకండ్ ఆఫ్ ను రైతుల సమస్యలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక ఎంటర్ టైన్ మెంట్ సినిమాలా చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ’ మారడం మురగాదస్ కు ఏమాత్రం నచ్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: