ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో రిలేష‌న్స్ చాలా డిఫరెంట్ గా వుంటాయి. బాలీవుడ్ లో అయితే మరీ దారుణంగా వుంటాయి. డ్రస్ ని మార్చినంత ఈజీగా రోజుకో ల‌వ‌ర్ ని మార్చేయ‌డం బాలీవుడ్ స్టార్స్ ప్రత్యేక‌త‌. ఏ స్టార్ ల‌వ్ స్టోరి చూసినా సేమ్ క‌హాని. అయితే ఇపుడు ఓ కొత్త ప్రేమ క‌ద బాలీవుడ్ ని ఫుల్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఇద్దరూ న‌టించిన ప్రేమ‌క‌ధ కూడా బాలీవుడ్ ని విప‌రీతంగా ఎట్రాక్ట్ చేసింది.

ఆషిఖి2....ఈ ఏడాది బ్లాస్ట బస్టర్ సినిమాల్లో ఒక‌టి. నిజానికి 12 కోట్ల బ‌డ్జెట్ తో తెరకెక్కి ఒన్ వీక్ లో 100 కోట్లు క‌లెక్ట్ చేసిన సినిమాగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది ఆషిఖి2. ఆ విష‌య ప‌క్కన‌పెడితే ఈ సినిమాలో ఆదిత్యా రాయ్ క‌పూర్, శ్రద్దాక‌పూర్ పెయిర్ అద్బుతం , మేడ్ ఫ‌ర్ ఇచ్ అద‌ర్ అన్నారు అంతా. అయితే ఇపుడు ఆ ఇద్దరూ నిజంగానే ఆ మాట‌ల్ని సీరియ‌స్ గా తీసుకున్నారు. ప్రేమ‌లో ప‌డ్డారు . చెట్టు పుట్టా...ప‌బ్ పార్క్ ల చుట్టు ప్రేమ పాటలు పాడుకుంటున్నారు.

నిజానికి ఇపుడు ఈ ఇద్దరి డేటింగ్ విష‌యమే బిటౌన్ లో ప్రతి ఒక్కరూ చ‌ర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు ముందు ఆదిత్యా రాయ్ క‌పూర్ రియా బ‌ర్తితో ప్రేమ‌లో వున్నాడు. శ్రద్దా క‌పూర్ చిన్న నాటి స్నేహితుడితో ప్రేమ‌లో వుంది. కానీ ఆషిఖి2 షూటింగ్ టైంలో శ్రద్దా అందం అత‌డిని మాయ చేయ‌డం....ఆదిత్యా శ్రద్దాని ప్రేమ‌లో ప‌డేయడం జ‌రిగాయట . దీంతో ఇద్దరూ పాత ల‌వ‌ర్స్ మ‌ర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. దీంతో ఒక్క సినిమాతోనే ఓల్డ్ రిలేష‌న్స్ మ‌ర్చిపోతే ఎలా ......... అయినా కెరీర్ మొద‌ట్లో హిట్ వ‌స్తే రెమ్యూన‌రేష‌న్స్ పెంచుకోవాల‌ని గానీ ఎఫైర్స్ కాద‌మ్మా అంటూ కొద్దిమంది బిటౌన్ లో గుస‌గుస‌లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: