‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా ఘన విజయంతో ప్రస్తుతం అందరి దృష్టి దర్శకుడు క్రిష్ పైనే ఉంది. అత్యంత భారీ  సినిమాని  కేవలం 78రోజులు పూర్తి చేసిన క్రిష్ సామర్ధ్యాన్ని చూసి అందరు క్రిష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ యుద్ధాలు, వందలమంది సైనికులు, ఫారిన్ లోకేషన్స్ ‘శాతకర్ణి’ సామ్రాజ్యం ఇలా చాలపెద్ద వర్క్ ఉండే ఈ సినిమాని  ఇంత  తక్కువ రోజుల్లో  క్రిష్ పూర్తి  చేయడం  టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
 
సంక్రాంతి రేస్ లో అత్యంత భారీ పోటీ ఎదుర్కుని విడుదలై సక్సస్స్ బాటల దూసుకుపోతున్న ఈ మూవీ పై ఒక  విచిత్రమైన గాసిప్  మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఇక వివారలోకి  వెళ్లితే బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, క్రిష్ కు ఉన్న సాన్నిహిత్యంతో  బన్సాలీ  తీసిన ‘బాజీరావు మస్తానీ’ సినిమాకు  సంబంధించి వాడని కొన్ని వార్ సీన్స్ ను క్రిష్ కొంత డబ్బులు చెల్లించి ఆ సీన్స్ ను ‘శాతకర్ణి’ లో తెలివిగా ఎడిట్ చేసి వాడాడని అందువల్లనే ‘శాతకర్ణి’ సినిమాని అంతత్వరగా సమయానికి సినిమా పూర్తి చేయగలిగాడని ఒక గాసిప్ ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది.

ఇప్పుడు ఈ గాసిప్పులు క్రిష్ వరకు వెళ్ళడంతో క్రిష్ చాలా ఘాటుగా స్పందించాడు  ‘నిజంగా చాలా దారుణమైన రాతలివి. కనీసం ఇంగితం లేకుండా ఇలాంటివి రాస్తున్నారు. వాళ్లకి వాళ్ళే గౌరవాన్ని పోగుట్టుకుంటున్నారు. అయినా ఇంత దారుణంగా ఎలా రాస్తారో అర్ధం కాదు.? సంజయ్ నా ఫ్రెండ్. గ్రేట్ ఫిల్మ్ మేకర్ అది భేస్ చేసుకొని ఇలా ఉహించి రాసేస్తారా? అసలు రాసిన వాళ్ళకి సినిమా పరిజ్ఞానం ఉందా’ అంటూ ఎదురు దాడికి దిగాడు క్రిష్. 

‘బాజీరావు మస్తానీ’ ఒక మూడ్ లో నడిచే సినిమా అని అంటూ ‘శాతకర్ణి’ ది మరో జోనర్ అని చెపుతూ  ‘గమ్యం’ నుండి తనను చూస్తూ తన పద్ధతి ఏమిటో తెలిసిన వాళ్ళు కూడ ఇలా తన పై పిచ్చిపిచ్చి రాతలు రాయడం ఆశ్చయంగా ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు క్రిష్. ఎటువంటి పరిజ్ఞానం లేకుండా కేవలం ఎదుటి వ్యక్తి పై బురద జల్లే ఇలాంటి ప్రయత్నాలను తాను పట్టించుకోను అంటూ సెటైర్లు వేసాడు క్రిష్. 

ఇది ఇలా ఉండగా ‘శాతకర్ణి’ మూవీ ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ కలక్షన్స్ ను కొల్లగొట్టి దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ మూవీకి లభిస్తున్న ఆదరణను చూస్తూ ఉంటే 2 మిలియన్ డాలర్స్ మార్క్ ను ఈసినిమా చేరుకున్నా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: