రాజకీయ వేత్తలు సెలెబ్రెటీలకు సంబంధించిన ట్విటర్ ఎకౌంట్స్ ను హ్యాక్ చేసి పలురకాలైన వివాదాస్పద ట్విట్స్ పెట్టి సంచలనాలు సృష్టించడం ఈమధ్య కాలంలో సాధారణ విషయంగా మారిపొయింది. ఇప్పుడు అటువంటి విచిత్ర పరిస్థితి మెగా స్టార్ చిరంజీవికి కూడ ఏర్పడటం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

సంక్రాంతి రేస్ కు వచ్చిన చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ టార్గెట్ చేస్తూ ఒక అజ్ఞాత వ్యక్తి మారుపేరుతో చేసిన ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి మీద అభిమానంతో ఇలాంటి ట్విట్ పెట్టారా ? లేదంటే చిరంజీవిని అవమాన పరచడానికి ఇలాంటి ట్విట్ పెట్టారా ? అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.  
‘ఇప్పుడే చిరంజీవితో ఫోన్లో మాట్లాడాను. అతడొక గొప్ప మనిషి. చాలా మంచి సినిమా తీశాడు. ఆయన 150వ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150ని చూశాను. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకాతో కలిసి సినిమాను ఎంజాయ్ చేశా. బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ అమెరికాకు మరికొద్ది రోజులలో అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న డోనాల్డ్ ట్రంప్ పేరుమీద హడావిడి చేస్తున్న ఈ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి పై అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేయడం ఆ తరువాత ట్విట్ చేయడం అన్నీ అబద్ధాలే అయినా ఈ విషయం కొంతసేపు మెగా అభిమానులలో హడవిడిని సృష్టించింది.  కొంతమంది మెగా అభిమానులు అయితే నిజంగానే ట్రంప్ ఫోన్ చేసి, మెగాస్టార్‌ను అభినందించారేమో అని భ్రమపడి ఆ ట్వీట్‌ను ఒకరికొకరు షేర్ చేసుకున్నారు కూడ. 

దీనితో ‘ఖైదీ’ మూవీ పై మరింత హైక్ తీసుకు రావడానికి ఒక మెగా వీరాభిమానిని ఈ వ్యవహారం అంతా నడిపాడు అని అనుమానాలు వస్తున్నా ఇలాంటి ఫేక్ ట్విట్స్ వల్ల చిరంజీవి ఇమేజ్ దెబ్బ తింటుంది కదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.  ఏదిఎమైనా ఈ ఫేక్ ట్విట్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: