ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు పెద్ద విజయాలు సొంతం చేసుకుంటాయని ముందు నుంచే చెబుతున్నారు.  అంతే కాదు ఆ మద్య అల్లు అర్జున్ ఈ సంక్రాంతి మెగా సంక్రాంతి అవుతుందని జోష్యం చెప్పాడు. బన్ని అన్నట్లే తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.  ఇక రాబోయే చిత్రాలు చూస్తే పవన్ కళ్యాన్ నటించే ‘కాటమరాయుడు’, అల్లు అర్జున్ నటిస్తున్న ‘డిజె(దువ్వాడ జగన్నాధమ్)’, సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ‘విన్నర్’, వరుణ్ తేజ నటించే ‘మిస్టర్’ లాంటి సినిమాలతో సందడి చేయబోతున్నారు.  
Image result for khaidi no 150
ఈ సంవత్సరం ఆరంభంలోనే మెగాస్టార్ తన స్టామినా ఏంటో చూపించారు..బాస్ ఈజ్ బ్యాక్ అంటే అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు.  ఇక తర్వాత బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నిలవబోతున్నారు. అయితే ఈ సినిమాపై అప్పుడు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. తమ్ముళ్ల బాగోగుల్ని కాంక్షిస్తూ ఓ అన్నయ్య ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు? తను ప్రేమించిన యువతి కుటుంబానికి ఎలా అండగా నిలిచాడు? ప్రజలు మెచ్చే నాయకుడిగా అందరి మనసుల్ని ఎలా గెలిచాడు? అనేది తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు శరత్‌మరార్.
Image result for katama rayudu new posters
 నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆయన నిర్మిస్తున్న చిత్రం కాటమరాయుడు చిత్రానకి డాలి దర్శకత్వం వహిస్తున్నారు.  అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. కుటుంబ బంధాలతో పాటు వినోదం, సెంటిమెంట్, యాక్షన్ అంశాలకు ప్రాధాన్యముంటుంది. ఫ్యాక్షన్ నాయకుడిగా పవన్‌కల్యాణ్ చాలా అద్భుతంగా నటించారట.  
Image result for katama rayudu new posters
ఉగాది కానుకగా మార్చి 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. అలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వీ, శివబాలాజీ, కమల్‌కామరాజు, చైతన్యకృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, కళ: బ్రహ్మాకడలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: