ఇప్పుడు ఎక్కడ చూసినా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తోంది అనేది పక్కన పెడితే తెలుగు సినిమా పరిశ్రమ కి ఈ చిత్రం అతిపెద్ద మార్పుగా చెబుతున్నారు . కేవలం 79 రోజుల్లో యాభై కోట్ల లోపు బడ్జెట్ తో సూపర్ అవుట్ పుట్ ని తీసుకొచ్చిన క్రిష్ వైపే అందరూ చూస్తున్నారు. పిరియాడికల్ సినిమా గా తెరకి ఎక్కిన ఈ సబ్జెక్ట్ ని జార్జియా - మొరాకా లాంట చోట్ల షూట్ చేసారు. కంగారు కంగారుగా సినిమాని చుట్టేసారు అనే ఫీలింగ్ అయితే ఎక్కడా అనిపించదు. కేవలం యాభై కోట్ల బడ్జెట్ లో బయటకి వచ్చిన అవుట్ పుట్ ఇది. అలాంటిది రెండొందల యాభై కోట్ల మేర బడ్జెట్ తో తీసే రాజమౌళి ఇంకెంత గొప్ప అవుట్ పుట్ ఇవ్వాలి ? క్రిష్ కంటే రాజమౌళి ఇమేజ్ ఈ రకంగా తక్కువ గా కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. రాజమౌళి లాగా సంవత్సరాలకి సంవత్సరాలు టెక్నీషియన్ లనీ హీరో నీ హీరోయిన్ నీ ఇబ్బంది పెట్టకుండా చక చకా లాగించేసాడు డైరెక్టర్ క్రిష్. ఎవరి స్టైల్ వారిది పోలికలు పెట్టకూడదు అని సర్దిచేప్పుకోవాలి ఏమో మరి. రాజమౌళి మాత్రం ఒక పని ఖచ్చితంగా చెయ్యాలి అది క్రిష్ నుంచే నేర్చుకోవాలి. రాజమౌళి కూడా క్రిష్ లాగానే ఒక పర్ఫెక్ట్ టార్గెట్ ని సెట్ చేసుకోవడం చాలా మంచిది. సంక్రాంతి కల్లా సినిమా విడుదల ని పూర్తి చెయ్యాలి అనుకున్నాడు క్రిష్ అది సాధ్యపడేలా చేసుకున్నాడు. నిర్మాతల మీద కాస్త కూడా భారం మోపకుండా క్రిష్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు. యుద్ధ స‌న్నివేశాల్ని ఈ స్థాయిలో తీయొచ్చు అంటూ బాహుబ‌లితో రాజ‌మౌళి నిరూపించాడు. అయితే.. వాటిని ఇంత త‌క్కువ ఖ‌ర్చులోనూ తీయొచ్చు అని క్రిష్ తీసి చూపించాడు. రాజ‌మౌళి టీమ్ లో హాలీవుడ్ నిపుణులు ఉంటే… త‌న‌కున్న బ‌డ్జెట్‌లో లోక‌ల్ టాలెంట్ ని న‌మ్ముకొని గౌత‌మి పుత్ర‌ని తీర్చిదిద్దాడు క్రిష్‌. ఇద్ద‌రిలో తేడా అదే. హ్యూమన్ ఎమోషన్స్ ని పట్టడం లో క్రిష్ రాజమౌళి కంటే ఒక మెట్టు ఎక్కువే వున్నాడు అని చెప్పుకోవాలి. గౌత‌మి పుత్ర‌ని ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా తీర్చిదిద్దుతూనే…. త‌న లైన్ దాట‌లేదు. స‌రిక‌దా..విమ‌ర్శ‌కుల చేత కూడా సెభాష్ అనిపించుకొన్నాడు. బాహుబ‌లి చూసి కొంత‌మంది విమ‌ర్శ‌కులు పెద‌వి విరిచిన వైనం మ‌నంద‌రికీ గుర్తుండే ఉంటుంది. కానీ క్రిష్ ఆ అవ‌కాశం ఎవ్వ‌రికీ ఇవ్వ‌లేదు. అదే… వీరిద్ద‌రిలో ఉన్న అస‌లైన తేడా!


మరింత సమాచారం తెలుసుకోండి: