తెలుగు ఇండస్ట్రీలో  వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో ‘దేవదాసు’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయవంతం కాలేక పోయాయి.  యంగ్ ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ గత సంవత్సరం ‘నేను శైలజ’ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు.  ప్రస్తుతం ఇండస్ట్రీల స్టార్ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో వారికి పోటీగా నిలిచేందుకు మనోడు నానా తంటాలు పడుతున్నాడు. గత సంవత్సం రిలీజ్ అయిన హైపర్ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రామ్ కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లింది.  
Image result for ram devadasu movie stills
దీంతో తన తదుపరి చిత్రం కోసం చాలా గ్యాప్ తీసుకున్న రామ్ ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవడమే కాకుండా కంప్లీట్ మేకోవర్ పై దృష్టి పెట్టాడు రామ్.  ప్రస్తుతం ఈ యంగ్ హీరో న్యూ లుక్ ని చూసి ఇంప్రెస్ అవుతున్నారు . ఈ గెటప్ తన కొత్త సినిమా కోసం కొత్తగా ట్రై చేస్తున్నాడు.  ఈ గెటప్ లో రామ్ ని చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టంగానే ఉంది.
Image result for ram devadasu movie stills
ప్రేమ కథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో నటించడానికి సమాయత్తం అవుతున్నాడు రామ్ . కరుణాకరన్ కోసమే ఈ కొత్త గెటప్. అప్పట్లో నాన్నకు ప్రేమతో చిత్రంలో ఎన్టీఆర్ న్యూ లుక్ తో బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే..ఇప్పుడు రామ్ కూడా అదే స్టైల్లో కనిపిస్తున్నాడు.  ఈ లుక్ ఇక్కడ బాగుంది మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి . 



మరింత సమాచారం తెలుసుకోండి: