సినిమా వాయిదా పడితే నిర్మాత కాస్తో కూస్తో బాధ పడతాడు కాని ఓ సినిమా విషయంలో మాత్రం ల్నిర్మాతలు వాయిదా పడటమే మేలని అనుకున్న పరిస్థితి వచ్చిందై. ఇంతకీ అలా జరిగిన సినిమా ఏంటి అంటే విలక్షణ నటుడు సూర్య నటించిన సింగం-3 మూవీ అదే ఎస్-3. హరి డైరక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ముందు వచ్చిన సింగం 1, 2 హిట్ అవగా దానికి కొనసాగింపుగా ఈ సినిమా తీశారు.

 

లాస్ట్ ఇయర్ నుండి వివిధ కారణాలతో ఎస్-3 పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. అసలైతే లాస్ట్ ఇయర్ దీవాళికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ చేసుకుని డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సింది. అది కుదరక జనవరి 26కి రిలీజ్ కన్ ఫాం చేశారు. కాని ఇప్పుడు ఆ డేట్ కూడా వాయిదా వేస్తున్నారు. తమిళనాడులో జల్లికట్టు గొడవలు తారాస్థాయికి చేరడంతో సినిమా మరోసారి పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించారు.

 

మొదట రెండు సార్లు వాయిదా వేసినప్పుడు సినిమాను తెలుగులో కొన్న డబ్బింగ్ రైట్స్ నిర్మాతలు కాస్త కంగారు పడ్డారు కాని ఈసారి వాయిదా వేయడం వల్ల వీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్నాయి. అందుకే ఈ టైంలో డబ్బింగ్ సినిమా వచ్చినా అంతగా ప్రభావితం చూపదన్ వారు ఈ పోస్ట్ పోన్ కు సుముఖత వ్యక్తపరిచారు. సూర్యతో పాటు అనుష్క, శృతి హాసన్ నటించిన ఈ సినిమా రిలీజ్ అప్పుడన్నది త్వరలో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: