సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు యాక్షన్ తరహా వచ్చిన చిత్రాలు చాలా వరకు విజయవంతం అయ్యాయి. ప్రపంచంలో ఎక్కువ శాతం కరాటే,కుంగ్ ఫూ లాంటి యాక్షన్ చిత్రాలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. కరాటె, కుంగుఫూ లో బ్రూస్ లీ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు యాక్షన్ హీరో జాకీ చాన్ కే వచ్చాయి. ఈయన నటించిన చాలా సినిమాల డూప్ లేకుండా చేసినవే కావటం మరో విశేషం. తాజాగా కల్పన చిత్ర పతాకంపై తెలుగులో జాకీ చాన్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'కుంగ్ ఫూ యోగ'.
కల్పన చిత్ర పతాకంపై మంచి విజయవంతమైన చిత్రాలను అందించిన శ్రీమతి కోనేరు కల్పన హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీ చాన్ లేటెస్ట్ మూవీ 'కుంగ్ ఫూ యోగ' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రంలో సోనూసూద్, దిశ పటాని, అమైరా దస్తూర్ కూడా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ నటీనటులు సోనూ సూద్, దిశా పటాని, అమైరా దస్తూర్ ముఖ్యపాత్రలు పోషించడం విశేషం.
గతంలో జాకీ చాన్, స్టాన్లీ టాంగ్ కాంబినేషన్లో రూపొందిన రంబుల్ ఇన్ ది బ్రాంక్స్, ది మిత్, చైనీస్ జోడియాక్ వంటి చిత్రాలు కలెక్షన్ పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న 'కుంగ్ ఫూ యోగ' చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి. జాకీ చాన్ మార్క్ యాక్షన్ కామెడీయే కాకుండా ఈ చిత్రంలో ఎన్నో ఫ్రెష్ ఎలిమెంట్స్ వున్నాయి.
జాకీ చాన్, ఆరిఫ్ లీ, లే జాంగ్ పాల్గొన్న కార్ ఛేజ్ సినిమాకి పెద్ద హైలైట్ కాబోతోంది. ముఖ్యంగా రకరకాల జంతువులు పిల్లల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం. మా కల్పన చిత్ర బేనర్లో ఈ చిత్రం మరో సూపర్‌హిట్ చిత్రమవుతుంది'' అన్నారు.