అనునిత్యం సంచలన వార్తలలో ఉండే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈమధ్య తన కోపాన్ని తగ్గించుకుని వివాదాలకు దూరంగా ఉంటున్నాడు.  స్వయం కృషితో జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకున్న ప్రకాష్ రాజ్ సమాజ సేవపట్ల తనకున్న మక్కువతో నటుడిగా తాను సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇస్తేనే ఆనందం అన్న ఉద్దేశంతో తెలంగాణా రాష్ట్రములోని పాలమూరు జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

ఈరోజు జరుగుతున్న రిపబ్లిక్ డే సందర్భంగా  తన దత్తత గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు ప్రకాష్ రాజ్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ  'నా కల వాస్తవ రూపం దాల్చిన రోజు అంటూ ఉద్వేగంగా మీడియాతో తన భావాలు పంచుకున్నాడు. 

గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ మరమత్తులు చేసిన పాఠశాల భవనంలో విద్యార్థులు, గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ ఈ కామెంట్స్ చేసాడు. చదువులో ప్రతిభ చూపిన పిల్లలకు బహుమతులను అందచేసిన ప్రకాష్ రాజ్ గ్రామంలో ఉన్న సమస్యలను ప్రతీ వ్యక్తిని అడిగి తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ఆ గ్రామానికి సంబంధించి తాను అందరివాడిని అన్న   సంకేతాలు ఇచ్చాడు.

ఈకర్యక్రమం పూర్తి అయిన తరువాత తన అభిమానులు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ 'ప్రజలతో భాగమవ్వడం, వారి ఆనందంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది' అంటూ కామెంట్ చేసాడు ప్రకాష్ రాజ్. ఈ నెల సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘శతమానం భవతి’ సూపర్ హిట్ కావడమే కాకుండా  ప్రకాష్ రాజ్ కు నటుడిగా మళ్ళి మంచి పేరు తెచ్చి పెట్టడంతో ప్రకాష్ రాజ్ హవా మళ్ళీ ప్ర్రారంభం అయింది అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: