నాచురల్ స్టార్ నాని క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుందని తన సినిమా ఫలితాలను చూసి చెప్పొచ్చు. కెరియర్ సంక్షోభం నుండి వరుస సూపర్ హిట్ మూవీస్ దాకా నాని జర్నీ కుర్ర హీరోలకు కూడా షాక్ ఇస్తుంది. అంతేనా స్టార్ హీరోలకు మాత్రమే క్రేజీగా ఉండే ఓవర్సీస్ లో నాని సినిమా ఏదైనా సరే బాగా రీచ్ అవుతుంది. నాని సినిమా అక్కడ ఎక్కువ థియేటర్స్ లో వేస్తున్నారు.


ఓవర్సీస్ లో 100 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ చేస్తే అది స్టార్ సినిమా అన్నట్టే. నాని భలే భలే మగాడివోయ్ సినిమా అలానే రిలీజ్ చేసి అక్కడ ఏకంగా 1.5 మిలియన్ డాలర్స్ కలక్షన్స్ సాధించారు. అయితే ఆ తర్వాత వచ్చినవి కూడా ఆ రేంజ్ కాకపోయినా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలే తెచ్చిపెట్టాయి. ఇక ప్రస్తుతం నాని నేను లోకల్ గా రాబోతున్నాడు. నక్కిన త్రినాధ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా.. క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నానికి జతగా నటించింది.


ఈ సినిమా ఏకంగా అమెరికాలో 125 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారట. బ్లూ స్కై సినిమాస్ అక్కడ నేను లోకల్ రిలీజ్ చేస్తున్నారు. 125 చోట్ల కూడా ప్రీమియర్స్ వేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రీమియర్స్ తోనే మంచి వసూళ్లు వచ్చేలా చూస్తున్నారు. మరి అమెరికాలో నానికి 125 స్క్రీన్స్ అంటే నాని బాగా ఎదిగాడని చెప్పొచ్చు. ఇక యావరేజ్ టాక్ వచ్చినా సరే సినిమా లాభం తెస్తుంది. ఇక సినిమా సూపర్ హిట్ అంటే మళ్లీ మిలియన్ రేసులో నాని ఉన్నట్టే. మరి ఈ ఏరియాలో ఇలాంటి క్రేజీ ఇమేజ్ సంపాదించడం గొప్ప విషయమని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: