ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామర్ ఉన్న హీరోయిన్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. వీరు ఏం చేసినా అది ఇండస్ట్రీలో హట్ టాపిక్ గానే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్‌ కి చెందిన టాప్ హీరోయిన్ అనుష్క శర్మ...ఓ మ్యాగజైన్ కి చుక్కలు చూపిందని అంటున్నారు. ఒక్క కవర్ పేజ్ కోసమే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ని వసూలు చేసి హాట్ టాక్స్ గా మారింది.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అనుష్క శర్మ ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తుంది. అలా ఒకవైపు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు కమర్షియల్‌ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉంటూ వస్తుంది. అలాగే కొన్ని మ్యాగజైన్స్ కి సైతం కవర్ పేజ్ కి ఫోజులు ఇస్తుంది. ఇలా తను ఏది చేసినా కమర్షియల్ ఫార్మెట్‌ లోనే ఉంటుంది. అయితే తాజాగా హెలో అనే మ్యాగజైన్ కి ఈ బ్యూటీ కవర్ పేజ్ కోసం స్టిల్స్ ని ఇచ్చింది.


ఇందుకు ఈ బ్యూటీ దాదాపు 70 లక్షలను వసూల్‌ చేసిందని అంటున్నారు. మొదటగా 30 లక్షలతో కొనసాగిన ఈ డీల్‌...తరువాత 70 లక్షలకు వెళ్ళింది. దాదాపు మూడు నెలలపాటు వరుసగా కవర్ పేజ్ కి సంబంధించిన స్టిల్స్ ని, కొన్ని ప్రత్యేక మైన ఆర్టికల్స్...అలాగే ఓ హాట్ ఫోటో షూట్‌ కోసం అనుష్క శర్మ దాదాపు 70 లక్షల రూపాయలను తీసుకుందని అంటున్నారు.


ఈ మధ్య కాలంలో ఓ మ్యాగజైన్‌ కి ఈ రేంజ్‌ లో రెమ్యునరేషన్ ని తీసుకున్న హీరోయిన్ ఒక్క అనుష్క శర్మ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుష్క శర్మ ముడు చిత్రాలలో నటిస్తుంది. ఈ మూడు చిత్రాలలో ఒక్కో చిత్రానికి తన రెమ్యునరేషన్ దాదాపు 3 కోట్ల రూపాయలు ఉండటం విశేషం. త్వరలోనే ఈ బ్యూటీ తన సొంత ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి...సినిమాని తీయనుందనే టాక్స్ సైతం వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: