మొన్న ‘బాహుబలి’ నిన్న ‘శాతకర్ణి’ ఇక రేపు ఇన్ కమ్ టాక్స్ టార్గెట్ ఎవ్వరు అన్న చర్చలు ఇప్పుడు ఫిలింనగర్ లో జరుగుతున్నాయి.  దీనితో టాలీవుడ్  బడా నిర్మాతలు వణికి పోతున్నారు అన్న వార్తలు హడావడి చేస్తున్నాయి. ‘శాతకర్ణి’ సినిమా హక్కులు కొన్న నితిన్ ని అతడి తండ్రిని లెక్కల పేరుతో గుచ్చిగుచ్చి ప్రశ్నించిన ఆదాయపన్ను అధికారుల తర్వాత టార్గెట్ ఎవరు అన్న ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. 

ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం భాగ్యనగరంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసుల దగ్గర ఒకలాంటి ఉద్విగ్న వాతావరణమే కనిపిస్తోంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత సంక్రాంతికి విడుదలైన భారీ సినిమాల వెనుక నల్లడబ్బు ఎక్కువగా చెలామణీ అయింది అన్న అనుమానాలు ఐటి శాఖకు ఉండటంతో ‘శాతకర్ణి’ ని ఐటి వర్గాలు టార్గెట్ చేసినట్లు ఫిలింనగర్ గాసిప్. 

దీనికితోడు సంక్రాంతి సినిమాలకు భారీ కలక్షన్స్ రావడంతో వాటి లావాదేవీలపై ఐటి అధికారులు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. విపరీతమైన రెమ్యునరేషన్లు తీసుకునే సినిమా సెలబ్రెటీలతో పాటు హిట్టయిన అన్ని సినిమా వసూళ్ల మీదా ఐటి కన్ను పడ్డం ఖాయమని అంటున్నారు. ఈ నేపధ్యంలో తొలి వీకెండ్ లోనే 100 కోట్ల సినిమా అని ప్రెస్ మీట్ పెట్టి కలెక్షన్స్ ను ప్రకటించిన 'ఖైదీ నం. 150' నిర్మాతలకు కూడ ఐటి భయం పట్టుకున్నట్లు సమాచారం. 

ఈసినిమాకు సంబంధించి కలక్షన్స్ ను ప్రకటించింది నిర్మాణ బాధ్యతలు దగ్గర ఉండి చూసుకున్నది అల్లు అరవింద్ అయినా వాస్తవానికి నిర్మాత రామ్ చరణ్ కాబట్టి చరణ్ కు కూడ టెన్షన్ మొదలైంది అంటూ ఫిలింనగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనితో కలక్షన్స్ ప్రకటించకపోతే ఒక సమస్య ప్రకటిస్తే మరొక సమస్యగా టాలీవుడ్ సినిమా నిర్మాతల పరిస్థితి తయారైంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: