అనారోగ్యంతో కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు క్రమంగా కోలుకుంటున్నారు. మంగళవారం వైద్యులు చికిత్స నిర్వహించడంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని కిమ్స్‌ డైరెక్టర్‌ వెల్లడించారు.

 

ప్రస్తుతం దాసరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని కిమ్స్‌ డాక్టర్లు తెలిపారు.ఆయనకు గత రెండు మూడు రోజులుగా కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. గురువారం మరోసారి దాసరి ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆ బులెటిన్‌లో దాసరి ఆరోగ్యం మెరుగుపడింది.. మూడు రోజుల్లో వెంటిలేటర్ తొలగిస్తామని వైద్యులు పేర్కొన్నారు.

 

కాగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో దాసరిని ఐసీయూలో ఉంచి వెంటిలెటర్‌ ద్వారా చికిత్సను అందించారు. దాసరి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, అన్నవాహికలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. మూత్రపిండాలకు డయాలసిస్‌ చేశారు. కాగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించడానికి మంగళవారం మధ్యాహ్నం ఆయనకు ఆపరేషన్‌ నిర్వహించామని వైద్యులు తెలిపారు. దాసరిని ఇవాళ కూడా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. నారాయణ రావు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: