టాప్ డైరెక్టర్స్ డేట్స్ దొరకక కొందరు హీరోలు ఇబ్బంది పడుతూ ఉంటే  కొందరు సీనియర్ డైరక్టర్లకు హీరోలు దొరకక  ఇబ్బంది పడుతున్నన విషయం తెలిసిందే. దీనితో చాలామంది సీనియర్ డైరెక్టర్స్ కు దిక్కుగా బాలకృష్ణ మారిపోయాడు. ప్రస్తుతానికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పూర్తి చేసి ఖాళీగా ఉన్నది ఒక్క బాలయ్య మాత్రమే. 

మిగతా టాప్ హీరోలు అంతా ఏదోఒక సినిమా ప్రాజెక్ట్ విషయంలో బిజీగా ఉన్నారు. సీనియర్ డైరక్టర్ కృష్ణవంశీతో బాలయ్య  సినిమా ఓకె అయింది కానీ అమితాబ్ అంగీకారం గురించి ఆగింది. ఈ పరిస్థితుల మధ్య కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్స్ కెఎస్ రవికుమార్ మరియు పి. వాసులు కూడ తమతమ కధలతో బాలకృష్ణను మెప్పించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ముఖ్యంగా కెఎస్ రవికుమార్ చెప్పిన 50 ఏళ్ల మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ స్టొరీ బాలకృష్ణకు బాగా నచ్చి నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులు ఇలాఉంటె గతంలో బాలయ్యతో ‘లయన్’ అనే డిజాస్టర్   మూవీని అందించిన డైరక్టర్ సత్యదేవా కూడా తన దగ్గర ఉన్న సార్వభౌమ కథను  బాలకృష్ణకు చెప్పి ఒప్పించడానికి గట్టి పయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ న్యూస్ బాలకృష్ణ అభిమానులకు టార్చర్ గా మారింది అని టాక్. ఇలా ఎవరికి వారు చాలామంది సీనియర్ డైరెక్టర్స్ బాలయ్య చుట్టూ తిరుగుతూ సినిమా చాన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే బాలయ్య ఎవరి బుట్టలో పడిపోతాడు అన్న భయాలు బాలకృష్ణ అభిమానులలో పెరిగి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇది చాలదు అన్నట్లుగా గతంలో బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన బెల్లంకొండ సురేశ్ ఈమధ్య ఒక సీనియర్ డైరెక్టర్ ను తీసుకు వెళ్లి ఒక కథను వినిపించి బాలయ్య డేట్స్ గురించి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే బాలకృష్ణ మాత్రం అందరూ చెపుతున్న కథలు వింటూ తన మనసులోని అభిప్రాయాన్ని మాత్రం బయటకు చెప్పకుండా ‘చూద్దాం’ అని తప్పించుకుని తిరుగుతున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: