ఫిల్మ్ ఇండస్ట్రీలో రూమార్స్ అనేవి చాలా కామన్. అయితే ఈ రూమర్స్ అనేవి కాస్త శ్రుతిమించితేనే సెలబ్రిటీలకి కోసం వస్తుంది. అప్పుడు సెలబ్రిటీలు వారిదైన శైలిలో జవాబు చెప్తారు. ఆ విధంగానే తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ హన్సిక ఓ టాప్ డైరెక్టర్ పై కాస్త దూకుడుగా ప్రవర్తించిందని అంటున్నారు.


ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనికి సంబంధించిన వార్తలపై వినిపిస్తున్న వివరాలను చూస్తే... స్టార్ స్టేటస్ వచ్చాక చాలా మంది స్టార్స్ ప్రవర్తనలో మార్పులు వస్తుండడం సహజం. అయితే కొన్ని పరిస్థితుల్లో వీరు హద్దులు దాటే ఛాన్స్ ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా జరిగే ఈ మార్పలను...వీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు మాత్రం పెద్దగా చూపించరు. బయటకు జరిగిన కొన్ని విషయాలను కొంత మంది కావాలని పదే పదే అడిగి విసిగిస్తే..వారికి ఈ సెలబ్రిటీలు గట్టిగానే సమాధానం చెబుతారు.


ఆ విధంగా తాజాగా హన్సిక...తన అప్ కమింగ్ మూవీ షూటింగ్ లో డైరెక్టర్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారింది. తాజాగా ఓ షూటింగ్ లో టాప్ హీరోయిన్ హన్సిక తాగి వచ్చి నానా హంగామా చేసిందనే న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఆ షూటింగ్‌ లో డైరెక్టర్ సరదాకి హన్సిక తాగి వచ్చిందని కామెంట్ చేశాడంట.


ఇందులో ఏ మాత్రం నిజం లేకపోవటంతో హన్సిక వెంటనే ఆ డైరెక్టర్ కి చెప్పుతో సమాధానం ఇస్తా అంటూ తపదైన శైలిలో చెప్పటంతో షూటింగ్ లోని వారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారని అంటున్నారు. గ్లామర్ బ్యూటీగా సౌత్ లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న హన్సిక మోత్వానీ...డైరెక్టర్ కి భలే సమాధానం చెప్పిందంటూ ప్రస్తుతం ఈ బ్యూటీపై అంతటా కాంప్లిమెంట్స్ ని అందుకుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: