నాచురల్ స్టార్ నాని హిట్ కొడితే కేవలం తనకు మాత్రమే కాదు మరో హీరో కూడా సంబర పడుతున్నాడు. ఇంతకీ నాని హిట్ కు సూపర్ హ్యాపీగా ఉన్న హీరో ఎవరు అంటే సినిమాలో స్పెషల్ రోల్ చేసిన నవీన్ చంద్ర. అటు విలన్ గా కాకుండా ఇటు మంచి వాడిలా కాకుండా నేను లోకల్ లో ఎస్సై క్యారక్టర్ తో నవీన్ చంద్ర అలరించాడు. అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నవీన్ సినిమాలైతే చేస్తున్నాడు కాని హిట్ మాత్రం దక్కట్లేదు.


రీసెంట్ గా రిలీజ్ అయిన మీలో ఎవరు కోటిశ్వరుడు సినిమా కూడా పోయింది. కెరియర్ సంక్షోభంలో ఉన్న నవీన్ చంద్రకు నేను లోకల్ హిట్ మంచి బూస్టప్ ఇస్తుందని చెప్పొచ్చు. తను హీరో కాకపోయినా సరే తను నటించిన సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆనందంలో తేలియాడుతున్నాడు నవీన్ చంద్ర. ఒడ్డు పొడుగు బాగుండి హీరోగా మంచి స్కోప్ ఉన్నా సరే నవీన్ కు మాత్రం అదృష్టం కలిసి రావట్లేదు.


ప్రస్తుతం నేను లోకల్ సక్సెస్ తో హిట్ ట్రాక్ ఎక్కేసిన నవీన్ ఇక ఈ జోష్ కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. ఇక వరుస విజయాలతో మంచి జోరులో ఉన్న నాని ఈ సక్సెస్ ను మరింత ఎంజాయ్ చేస్తున్నాడు. నాని కీర్తిల జంట కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. రొటీన్ సినిమా అయినా సరే టేకింగ్ తో అబ్బురపరచిన దర్శకుడు త్రినాధరావు అన్నివిధాలుగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: