యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ వరుసగా రెండు భారీ విజయాల్ని దక్కించుకుని ప్రస్తుతం మరో ఫ్యూచర్ ఫిల్మ్ కోసం రెడీ అవుతున్నారు. తాజాగా బాబీ డైరెక్షన్లో ఒక చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. బాబీతో కలిసి చేయబోతున్న మూవీని సోదరుడు కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. దీంతో ఈ మూవీకి ఎక్కడలేని క్రేజ్ క్రియేట్ అవుతుంది.


ఇక ఈ మూవీని నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లతో నిర్మించాలని చూస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని కళ్యాణ్‌ రామ్‌ తీసుకున్నారు. ఇందులో ఫోటోగ్రఫీ కోసం‘త్రీ ఇడియట్స్, పీకే’ వంటి భారీ సినిమాలకు పనిచేసిన సికే మురళీధరన్ ను కళ్యాణ్ రామ్ తీసుకున్నారు. అలాగే తాజాగా మరో ప్రసిద్ధ టెక్నీషియన్ అయిన వాన్స్ హార్ట్వెల్ ని తీసుకున్నారు.


హాలీవుడ్ లో కృత్రిమ అవయవాల సృష్టికర్త, మేకప్ ఆర్టిస్ట్ అయిన వాన్స్ హార్ట్వెల్ ఈ ఫీల్డ్‌ లో సుమారు 30 ఏళ్ళ అనుభవం ఉంది. ‘లార్డ్ అఫ్ ది రింగ్స్,లైఫ్ అఫ్ పై, ఐరన్ మాన్, రోబో‘ వంటి చిత్రాలకు వాన్స్ హార్ట్వెల్ పనిచేశారు. అయితే ఇంత మంచి టాలెంటెడ్‌ టెక్నిషియన్స్ తో ఎన్టీఆర్ ఏ తరహా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారింది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకి భిన్నంగా ఇందులో ఎన్టీఆర్ నటన ఉంటుందనేది ఇండస్ట్రీ సమాచారం.


దీంతో ఎన్టీఆర్ పలు గెటప్ లలో కనిపిస్తాడని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి టాప్ హీరోలు విభిన్నమైన చిత్రాలలో నటించటంతో ఎన్టీఆర్ సైతం ఓ విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ప్రయోగాల జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిదని అంటున్నారు. దీంతో చాలా మంది ఎన్టీఆర్ కథా విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడేమో అని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: