క్రియేటివ్ దర్శకుడు రాజమౌళి చేసే ఆలోచనలు చాల విభిన్నంగా ఉంటాయి. అందువల్లనే జక్కన్న తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళిన దర్శకుడుగా రికార్డు క్రియేట్ చేసాడు.  ఈ పరిస్థుతుల నేపధ్యంలో రాజమౌళికి వచ్చిన కొత్త ఆలోచన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆలోచన ప్రకారం మనమే బాహుబలిగా మారిపోయి కాలకేయుడిని అంతమొందించవచ్చు. 

అలాగే భళ్ళాలదేవుడిలా మారి రాజకీయ ఎత్తుగడలు వేయవచ్చు. ఇది అంతా మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్ ద్వారానే చేయబోతున్నాం.  తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలో 'బాహుబలి' సినిమా ఆధారంగా ఓ మొబైల్‌ గేమ్‌ రాబోతోంది. ఈ గేమ్ ద్వారా ‘బాహుబలి 2’ ప్రమోషన్ జరుగుతూనే ఈసినిమా నిర్మాతలకు డబ్బు వచ్చే కొత్త మార్గాన్ని అన్వేషించాడు రాజమౌళి. 

గతంలో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ 'బాహుబలి' అనే మహావృక్షానికి ఈ సినిమా కేవలం ఓ కొమ్మ మాత్రమే అని చెప్పిన రాజమౌళి .’బాహుబలి’ ని ఒక బ్రాండ్ గా మారుస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కామిక్‌బుక్స్‌, వీఆర్‌ మొదలైన వాటిని తీసుకొచ్చాడు రాజమౌళి. 

ఇది చాలదు అన్నట్లుగా రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన మొబైల్ గేమ్ ను తీసుకు రాబోతున్నాడు. దీనికి సంబంధించి మూన్‌ఫ్రాగ్‌ ల్యాబ్స్‌కు చెందిన మార్క్‌ స్కగాస్‌ తో ‘బాహుబలి’ లోతైన చర్చలు జరుపుతున్నారు. ఇతడు ఫామ్‌విల్లే, లార్డ్‌ఆఫ్‌ రింగ్స్‌ సినిమాలకు గేమ్ లను సృష్టించిన సృష్టి కర్త. త్వరలోనే ఇతడు క్రియేట్ చేసిన ‘బాహుబలి’ గేమ్ మన అరచేతిలోకి రాబోతోంది. 

ఏప్రియల్ లో విడుదల కాబోతున్న బాహుబలి 2 అప్పుడే 500 కోట్ల వరకు బిజినెస్ జరిగింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో త్వరలో విడుదల కాబోతున్న ఈ ‘బాహుబలి’ గేమ్ క్రేజ్ తో ఈ మూవీ బిజినెస్ మరింత పెరిగే ఆస్కారం ఉంది. అన్నీ అనుకూలిస్తే 1000 కోట్ల కలక్షన్స్ సినిమాగా ‘బాహుబలి 2’ ను మార్చాలి అని రాజమౌళి కలలు కంటున్న నేపధ్యంలో ఆ కలలను ఈ మొబైల్ గేమ్ ఎంతవరకు నిజం చేస్తుందో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: