తెలుగు ఇండస్ట్రీలో ‘సూపర్ ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరి బ్యూటీ అనుష్క తర్వాత అగ్ర కథానాయకుల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  స్వతహాగా యోగా టీచర్ అయిన అనుష్క తన బాడీ విషయంలో ఎంతో జాగ్రత్తలు పడుతూ అందమైన శరీరసౌష్టవంతో ఉండేది.  ముఖ్యంగా  పర్సనాలిటీ ఉన్న హీరోలకు ఈ అమ్మడు మంచి జోడీగా ఉండేది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయిన ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’ చిత్రాల్లో నటించింది.  అయితే ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే అనుష్క ‘సైజ్ జీరో’ విషయంలో ఏకంగా తన శరీరంపైనే ప్రయోగం చేసుకుంది.  
Image result for anushka size zero
ఆ సినిమాకు తగ్గట్టుగా లావుగా కనిపించడానికి అదిక బరువు పెరిగింది.  సినిమా మాత్రం పెద్దగా విజయం సాధించకపోయినా..అనుష్క చేసిన ప్రయోగానికి, నటనకు మంచి మార్కులు పడ్డాయి.  అప్పటి నుంచి అనుష్క సన్నబడటానికి తెగ తంటాలు పడుతూనే ఉంది. ఈలోగా సింగం, బాహుబలి 2, భాగమతి సినిమాలతో బిజీగా మారిపోయింది.   సైజ్ జీరో చిత్రం కోసం అనుష్క లావు కాగా ఆ లావు తగ్గడానికి నానాపాట్లు పడినప్పటికీ అనుకున్న రేంజ్ లో మాత్రం లావు తగ్గలేదు దాని ఫలితం ఇతర సినిమాలపై కూడా పడుతోంది .
Image result for anushka size zero
తాజాగా రిలీజ్ అయిన సింగం 3 లో అనుష్క ని చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం ఎందుకంటే అంతలావు గా ఉంది అనుష్క . సింగం 3 లో ఇంత లావుగా ఉంటే బాహుబలి 2 లో ఎలా ఉంటుందో చూడాలి . అయితే అప్పటికే 40 శాతం కి పైగా సినిమా కంప్లీట్ అయ్యింది కాబట్టి మిగతా వర్క్ ని ఎలా పూర్తిచేసాడో సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు. ఏది ఏమైనా అనుష్క చేసిన ప్రయోగం తనకే తిప్పికొట్టిందని సినీ వర్గాల గుసు గుస.

Image result

మరింత సమాచారం తెలుసుకోండి: