త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ హీరోగా రాధాకృష్ణ నిర్మాణంలో మొదలు పెట్టబోతున్న మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు హడావిడి చేస్తోంది.  ఈమూవీ బడ్జెట్ దాదాపు 100 కోట్లకు చేరిన నేపధ్యంలో ఈమూవీకి బయ్యర్ల దగ్గర నుండి మరింత మార్కెట్ రప్పించడానికి త్రివిక్రమ్ ‘జనతా గ్యారేజ్’  సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు టాక్.

‘జనతా గ్యారేజ్’ అద్భుత విజయంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్రను ఎవరూ ఏమాత్రం తక్కువ అంచనా వేయలేరు. ఇప్పుడు పవన్ త్రివిక్రమ్ ల మూవీ విషయంలో కూడ ఈసినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చడానికి మోహన్ లాల్ సెంటిమెంట్ ను క్రేజ్ ను త్రివిక్రమ్ వాడుకోబోతున్నాడు అని తెలుస్తోంది.  

ఈమధ్య కాలంలో మోహన్ లాల్ సినిమాలకు మన టాలీవుడ్ లో కూడ మంచి క్రేజ్ ఏర్పడటంతో ఆయన సినిమాలను వరస పెట్టి డబ్ చేస్తున్నారు.  ఆ మూవీల కలక్షన్స్ కూడ బాగుంటున్నాయి. ఈవిషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ పవన్ సినిమాలో మోహన్ లాల్ కోసం ఒక ప్రత్యేక పాత్రను సృష్టించినట్లు తెలుస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే త్రివిక్రమ్ మోహన్ లాల్ ను కలవడం ఈ పాత్ర స్వరూపం వివరించడం జరిగిoది అని  అంటున్నారు. త్రివిక్రమ్ చెప్పిన కథకు మోహన్ లాల్ ఓకె చెప్పాడని తెలుస్తోంది. 

అయితే మోహన్ లాల్ ప్రస్తుతం మలయాళ సినిమా రంగంలో చాల బిజీగా ఉన్న నేపధ్యంలో తాను కొద్దిరోజులు మాత్రమే పవన్ త్రివిక్రమ్ ల మూవీకి డేట్స్ ఇవ్వగలనని అయితే ఆ డేట్స్ కు తగ్గట్టుగా పవన్ తన డేట్స్ ఇవ్వడమే కాకుండా షూటింగ్ కంటిన్యూగా జరగడానికి పవన్ వైపు నుంచి సహకారం కావాలి అని కండిషన్స్ పెట్టినట్లు టాక్.  దీనితో తరుచు మూడ్ మారిపోయే పవన్ ను మోహన్ లాల్ డేట్స్ కు ఎలా సద్దుబాటు చేయాలి అన్న ఆలోచనలలో ప్రస్తుతం త్రివిక్రమ్ ఉన్నట్లు గాసిప్పులు వినపడుతున్నాయి.  ఈవార్తలే నిజం అయితే పవన్ త్రివిక్రమ్ ల మూవీ బ్లాక్ బస్తర్ హిట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: