టాప్ హీరోల ప్రాపకం కోసం క్రేజీ హీరోయిన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. దీనితో హీరోయిన్స్ అందరికీ హీరోలను పొగడ్తలతో  నామస్మరణ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే రకుల్ దీనికి భిన్నగా తాను మహేష్ బాబు మూవీ ఫెయిల్ అయినందుకు ఆనంద పడుతున్నాను అని అర్ధం వచ్చేలా కామెంట్స్ చేయడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

ఆశ్చర్యకరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే రకుల్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి ముఖ్యంగా తన కెరియర్ తొలిరోజులలో తాను పోగొట్టుకున్న అవకాశాలు ఎలా తనకు అదృష్టంగా మారాయి అన్న విషయాన్ని వివరంగా వివరించింది. చైతు సినిమాలలో భయంకరమైన ఫ్లాప్ గా ముద్రపడిన ‘ఆటోనగర్ సూర్య’ కు మొదట్లో రకుల్ ను హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే చైతన్య పట్టుపట్టడంతో రకుల్ ను తొలగించి సమంతను అప్పట్లో ఎంపిక చేసిన విషయాన్ని బయట పెట్టింది రకుల్.

అదేవిధంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సంబందించి మొదట్లో రకుల్ ను హీరోయిన్ గా అనుకుని ఆ తరువాత ఆమె డేట్స్ కుదరక పోవడంతో రకుల్ స్థానంలో కాజల్ ను ఎంపిక చేసిన విషయాన్ని బయట పెట్టింది రకుల్. ఇలా రెండు భారీ సినిమాలు పోగొట్టుకున్నందుకు రకుల్ అప్పట్లో తెగ బాధ పడిందట.

అయితే అనూహ్యంగా ఈ రెండు సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో తనకు ఫ్లాప్ హీరోయిన్ అన్న ముద్ర పడకుండా తప్పించుకున్నందుకు ఆనందగా ఉంది అని అంటోంది రకుల్. అంతేకాదు ఏమి జరిగినా అది మనకు అదృష్టాన్నే ఇస్తుంది అన్న పాజిటివ్ ఫీలింగ్ మనం ఏర్పరుచుకోగలిగితే ఎవరికైనా ఎక్కడైనా సూపర్ సక్సస్ రావడం ఖాయం అన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: