ఒక్క సినిమా హిట్ తనే చాలా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు హీరోయిన్స్. లేటెస్ట్ యూత్ క్రేజీ డైరెక్టర్ మారుతి సినిమాతో ఫాం లోకి వచ్చిన తెలుగు  పిల్ల నందిత ఈ మధ్య  ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నది’ఒక ఛాన్స్ పోతే మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తాం నేను అదే చేశాను నా మొదటి సినిమా ప్లాఫ్ అయ్యింది నిరాశ పడకుండా రెండో సినిమా చేశాను అది ఎంత సూపర్ హిట్ అయ్యిందో మీకందిరికి తెలుసు’ అంటూ తన గొప్పలు మొదలుపెట్టింది.

 ప్రస్తుతం నందిత తమిళ, కన్నడ సినమాల్లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తోంది..రాంచరణ్ నెక్స్ట్ మూవీకి నందితని  ఒక నిర్మాత అప్రోచ్ అయ్యాడనీ  కానీ ఇంకా కన్ ఫర్మ్ అవ్వలేదని సమాచారం. ఇదే ఇంటర్వ్యూలో మీకు ఏమైనా గోల్స్ వున్నాయా అనిఅడిగితే “ నావి చాలా పెద్ద కోరికలని చెప్పడం కుదరదని ముందు బెట్టు చేసి తరువాత  పెద్ద హీరోలతో నటించాలని, నిర్మాతల హీరోయిన్ గా  పేరు తెచ్చుకొని ,టాలీవుడ్ లో నెం1 హీరోయిన్ గా  ఎదగాలనీ  చాలా పెద్ద కోరికలే చెప్పింది నందిత.  

హీరోయిన్ అన్న తర్వాత మంచి సినిమాలలో నటించాలను కోవడం, ఛాన్స్ లు రావలనుజోవడం తప్పేంకాదు కానీ మరి ఈ అమ్మడి కోరిక ఎన్ని కోట్లో తెలియాలి....  

మరింత సమాచారం తెలుసుకోండి: