మంచు ఫ్యామిలీ నుండి డేరింగ్ హీరోగా రాకింగ్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మనోజ్ తన సినిమాకు థియేటర్ సమస్యలు వచ్చాయని అంటున్నాడు. అసలైతే తన సినిమాను ఫిబ్రవరి 24కు రిలీజ్ చేద్దామని అనుకున్నా థియేటర్స్ ఖాళీగా లేకపోవడంతో మార్చ్ 3కి పోస్ట్ పోన్ చేసుకున్నామని అంటున్నాడు మనోజ్. ఏదో చిన్న హీరో సినిమాలకు థియేటర్ సమస్య అంటే ఓకే కాని మనోజ్ లాంటి హీరోకి ఈ సమస్య రావడం షాక్ అయ్యేలా చేస్తుంది.


సత్య డైరక్షన్ లో చేస్తున్న గుంటూరోడు సినిమా తన ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయని చెబుతున్నాడు మనోజ్. సినిమా తప్పకుండా తన ఫ్యాన్స్ ను అలరిస్తుందని అన్ని కమర్షియల్ హంగులున్న సినిమాగా ఇది తెరకెక్కించబడిందని అంటున్నాడు. ఇక ఫిబ్రవరి లో రిలీజ్ అయిన అన్ని సినిమాల ఫలితాలు బాగున్నాయని. అలానే మార్చ్ 3న రిలీజ్ అవుతున్న తన సినిమా కూడా మంచి ఫలితం అందుకుంటుందని అభిప్రాయపడ్డాడు మంచు మనోజ్.


ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ తనకు నచ్చిన ఎక్స్ పరమెంట్ మూవీస్ మళ్లీ మొదలు పెడతానని.. తన క్యారక్టర్ కోసమే ఇలా లావు పెరిగానని మళ్లీ కచ్చితంగా ప్రయాణం, నేను మీకు తెలుసా లాంటి సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. మంచు ఫ్యామిలీ నుండి క్రేజీ హీరోగా వచ్చిన మనోజ్ మొదట్లో సూపర్ హిట్లు అందుకున్నాడు. కాని ఈమధ్య కెరియర్ కాస్త అటు ఇటుగా ఉంది మరి గుంటూరోడుతో అది గాడిన పడుతుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: