89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ సినీ తారల తళుకు, బెళుకులతో ఆస్కార్‌ ప్రధాన వేదిక ఆకర్షణీయంగా మారింది. హాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా దేశ విదేశాల సినీ పరిశ్రమలకు చెందిన అతిరథ, మహారథులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. విభిన్న వస్త్రధారణతో హీరోయిన్స్‌ రెడ్ కార్పెట్‌ పై హొయలు పోతూ.. కెమెరాలకు ఫోజులు ఇస్తూ అందాలు ఆరోబాశారు. 


ఆస్కార్ అవార్డుల వేడుక ఆద్యంతం అందరిని ఆకట్టుకుంది. 89వ ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా మూన్ లైట్ ఎంపికవగా... లా లా ల్యాండ్‌ పలు విభాగాల్లో అత్యధిక ఆస్కార్‌ లను అందుకుంది. ఈ యేడు ఉత్తమ నటిగా లాలా ల్యాండ్‌ మూవీలో హీరోయిన్‌ గా యాక్ట్‌ చేసిన ఎమ్మా స్టోన్ ఎంపికవగా.. ఉత్తమ నటుడిగా మాంచెస్టర్ బై ద సీ.. సినిమాలో హీరోగా నటించిన కసే ఎఫ్లెక్ ఆస్కార్‌ అందుకున్నారు. లా లా ల్యాండ్‌ సినిమా డైరెక్టర్‌ డేమియన్‌ చాజెల్‌.. ఉత్తమ దర్శకుడుగా ఆస్కార్‌ చేజిక్కించ్చుకున్నారు.


అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో మూన్‌ లైట్‌ సినిమాకు పనిచేసిన బ్యారీ జెన్కిన్స్, టరెల్ అల్విన్ సంయుక్తంగా ఆస్కార్‌ ను అందుకున్నారు. మాంచెస్టర్ బై ద సీ.. సినిమాకు స్కీన్‌ ప్లే అందించిన కెన్నత్ లొనెర్గాన్  ఉత్తమ స్క్రీన్ ప్లే  అవార్డును పొందాడు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా  లాలా ల్యాండ్‌ సినిమాలోని సిటీ ఆఫ్ స్టార్స్ కైవసం చేసుకుంది. ఉత్తమ సహాయనటుడిగా మూన్లైట్‌ సినిమాలో యాక్ట్‌ చేసిన మహేర్షల అలీ ఎంపికయ్యారు. ఫెన్సెస్‌ మూవీలో నటించి వివోలా డేవిస్‌ ఉత్తమ సహాయనటి అవార్డును కైవసం చేసుకుంది.


లా లా ల్యాండ్‌ సినిమా ఉత్తమ ఒరిజినల్ స్కోర్ అవార్డును కూడా కొల్లగొట్టింది. లాలా ల్యాండ్‌ మూవీకి పనిచేసిన లినస్‌ శాన్గ్రెన్‌ ఉత్తమ ఛాయాగ్రహకుడిగా అస్కార్‌ అందుకున్నాడు. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ విభాగంలో సింగ్‌ సినిమాకు.. క్రిస్టఫ్ డీక్, అన్నా యుడ్వర్డీ ఆస్కార్‌ గెలిచారు. ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రంగా.. ద వైట్ హెల్మెట్స్ నిలువగా.. ఓర్లాండో వోన్ ఇన్సీడెల్, జోన్నా నటసెగర అవార్డును అందుకున్నారు. జాన్ గిల్బర్ట్ సినిమాకు ఎడిటర్‌ గా పనిచేసిన హాక్సా రిడ్జ్ ఉత్తమ ఎడిటర్‌ గా నిలిచారు.


ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో ద జంగిల్ బుక్ సినిమాకు పనిచేసిన రాబర్ట్ లిగాటో, ఆడమ్ వాల్డెజ్, ఆండ్ర్యూ ఆర్. జాన్స్, డ్యాన్ లెమన్ లు సంయుక్తంగా ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో లాలా ల్యాండ్ మూవీకి.. డేవిడ్ వాస్కో, శాండీ రేనాల్డ్స్ గెలుపొందారు. యానిమేటెడ్ లఘు చిత్రంగా పైపర్ నిలిచింది. ఆ మూవీకి పనిచేసిన అలాన్ సరిల్లరో, మార్క్ సన్డెల్మెర్ అవార్డును అందుకున్నారు. ఈ యేటి యానిమేటెడ్ ఫీచర్ చిత్రంగా  జూటోపియా అవార్డును అందుకుంది. 


ఉత్తమ విదేశీచిత్రం కేటగిరిలో ఇరాన్‌ మూవీ  సేల్స్‌ మేన్‌ ఆస్కార్‌ అవార్డును ఎగురేసుకుపోయింది. సౌండ్ మిక్సింగ్ విభాగంలో హాక్సా రిడ్జ్, సౌండ్ ఎడిటింగ్ విభాగంలో బెల్లిమార్‌ సినిమాకు సౌండ్‌ ఇంజనీర్‌ గా పనిచేసిన అరైవల్ అస్కార్‌ గెలుచుకున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డును ఒ.జె. మేడ్ ఇన్ అమెరికా గెలుపొందింది. ఈ డ్యాక్యుమెంటరీకి పనిచేసిన ఎజ్రా ఎడిల్మ్యాన్, కరోలైన్ వాటర్ లో అవార్డును స్వీకరించారు. 


ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఫెంటాస్టిక్ బీస్ట్స్ అండ్ వేర్ టూ ఫైండ్ ధెమ్ కు కాస్ట్యూమ్‌ అందించిన కొలెన్ ఎట్ ఉడ్ ను ఆస్కార్‌ వరించింది. ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ విభాగాల్లో సుసైడ్ స్క్వాడ్ అవార్డులను సాధించింది. అల్సాండ్రో బెర్టాల్జీ, జిర్జోయో గెగ్రేరియన్, క్రిస్టోఫర్ నీల్సన్ ఆస్కార్‌ లను అందుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: