సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న ఇలియానా బాలీవుడ్ లో ఒక్క అవకాశం రాగానే అక్కడకి చెక్కేసింది.. అక్కడ కూడా నామమాత్రపు అవకాశాలతో కాలం గడుపుతున్న అమ్మడు తన లవర్ తో మంచి జోష్ లో ఉంది. ఒకవేళ తనని గుర్తించి ఎందుకు సినిమాలు చేయట్లేదు అని అడిగితే మాత్రమ నచ్చిన కథలు రావట్లేదు అని చెబుతుందట. అమ్మడికి నచ్చిన కథలంటే ఎలా ఉంటాయో మరి అని అంటున్నారు.


తెలుగు తమిళ భాషల్లో కెరియర్ సాఫీగా సాగుతుంటే అది కాదనుకుని బీ టౌన్ బాట పట్టింది. అక్కడి ప్రేక్షకులు అమ్మడి సొగసులకు అంత కిక్ ఫీల్ అవ్వలేదు అందుకే ఎన్ని సినిమాలు చేసినా ఆశించిన హాట్ ఇమేజ్ సంపాదించలేకపోయింది ఇలియానా. రిటర్న్ వచ్చి సౌత్ లో ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ కాకపోవడంతో అమ్మడు కథలు నచ్చట్లేదు అని కటింగులు ఇస్తుంది. 


అసలు ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేయడమే ఎక్కువ అనుకుంటుంటే తనకు వచ్చిన అవకాశాలను కథ నచ్చలేదని చెప్పడం ఇలియానా కవరింగ్ చేస్తుందని అనుకుంటున్నారు. ఎలాగు అవకాశం వస్తే చేస్తుందని తెలిసినా అవకాశాలు రావట్లేదు అని చెప్పడానికి బదులు ఇలా కథ నచ్చట్లేదని కబుర్లు చెబుతుంది. ఛాన్స్ దొరికితే తన లవర్ తో న్యూడ్ ఫోటోలను తీయించుకుని ఫ్యాన్స్ కు షేర్ చేస్తుంది ఇల్లి బేబ్ కెరియర్ కు దాదాపు ఎండ్ కార్డ్ పడ్డట్టే. 


మరింత సమాచారం తెలుసుకోండి: