తెలుగు ఇండస్ట్రీకి ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అనుష్క.  స్వతహాగా యోగా టీచర్ అయిన అనుష్క అందమైన ఫిట్ నెస్ తో అందరు హీరోలకు మంచి జోడీగా ఉంటూ వచ్చింది.  అయితే అనుష్క కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా అరుంధతి, పంచాక్షరి,రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో లేడీ ఓరియెటెడ్ పాత్రలతో మెప్పించింది.   అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటి ‘బాహుబలి’ చిత్రంలో డీ గ్లామర్ పాత్రలో నటించి ఔరా అనిపించుకుంది.  ఇక సైజ్ జీరో చిత్రంతో ఏకంగా తన బాడీ వెయిట్ పెంచుకొని ఆంటీలా కనిపించింది.  
Image result for baabubali 2 anuskha
ఇటీవల విడుదలైన ‘సింగం-3’, ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాల్లో బొద్దు అనుష్కను చూసి అందరూ షాకయ్యారు.  ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘బాహుబలి 2 ’ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.  ఆ మద్య బాహుబలి సినిమాకు మూడు నెలల ముందు నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు..అయితే దీనికి వెనుక ఓ రహస్యం దాగి ఉంది.  ఈ సినిమాలో అనుష్క పాత్ర కీలకం.
Image result for size zero movie
ఈ రెండో భాగానికి సంబంధించి అనుష్క సీన్లను మొదటి భాగంతోపాటే తీశారు. కొన్ని సీన్లను మాత్రం ఇటీవల షూట్‌ చేశారు. అప్పట్లో అనుష్క సన్నగా నాజూగ్గా ఉండేదట..కానీ ఈ మద్య అనుకోకుండా లావు కావడంతో సమస్య ఎదురైందట రాజమౌళికి. అందుకే అనుష్కకు సంబంధించిన సీన్లకు భారీ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్‌ను వాడుతున్నారట. అంతే కాదు ఆ మద్య బాహుబలి కి సంబంధించిన పోస్టర్ లో ప్రభాస్, అనుష్క ఫోటో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో అనుష్క సన్నగా కనిపిస్తుంది..అయితే ఈ ఫోటోపై రక రకాల కామెంట్స్ కూడా వచ్చాయి.  
Image result for bahubali 2 anushka prabhas
సినిమా అంతా అనుష్కను అలా చెక్కడానికి గ్రాఫిక్స్‌ టీమ్‌ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటోందట. అందుకే ట్రైలర్‌ లేటవుతోందని టాక్‌. అయితే.. ట్రైలర్ ఆలస్యానికి కారణం గ్రాఫిక్స్ వర్కే కారణమని, వీఎఫ్ఎక్స్ స్టూడియో వాళ్లు గ్రాఫిక్స్ ఇచ్చిన వెంటనే ట్రైలర్‌ను విడుదల చేస్తామని రాజమౌళి రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: