ఒకప్పటి సినిమాలలోని ఎస్.వి.రంగారావు తరహాలో ఎటువంటి  తరహా పాత్రను అయినా నటించి మెప్పించగల సమర్థత ఒక్క ప్రకాష్ రాజ్ కు మాత్రమే సొంతం. అయితే ఈ విలక్షణ నటుడు నిజ జీవితంలో చేసే ఓవర్ యాక్షన్ కు సంబంధించిన సంఘటనలు ఎన్నో సార్లు మీడియాలోకి వచ్చాయి.

ఈ సంఘటనల వల్ల ప్రకాష్ రాజ్ గతంలో అనేక వివాదాలలో కూడ చిక్కుకున్నాడు. అయినా తన తీరు ఏమాత్రం మార్చుకోడు ఈ విలక్షణ నటుడు.  ప్రకాష్ రాజ్ ఓవర్ రియాక్షన్ కు సంబంధించిన వార్తలు ఎన్నో ఉన్నాయి. ఆ మధ్య కావేరీ జల వివాదం గురించి ఒక టీవీ చానల్ లైవ్ లో స్పందన అడిగినందుకు ప్రకాష్ రాజ్ ఆ టివి యాంకర్ పై రెచ్చిపోయిన విషయం తెలిసిందే. 

ఈమధ్య తిరుపతిలో ప్రకాష్ రాజ్ కు సంబంధించిన ఇలాంటి వ్యవహారం మరొకటి జరిగింది. తన కుటుంబంతో కలిసి దర్శనానికి వచ్చిన ప్రకాష్ రాజ్ ను అక్కడి లోకల్ మీడియా ప్రతినిధులు అప్పట్లో కుదిపేస్తున్న జల్లికట్టు వ్యవహారం గురించి స్పందించమంటే ఆ మీడియా ప్రతినిధి పై రెచ్చిపోయిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 

ఇది చాలదు అన్నట్లుగా లేటెస్ట్ గా చెన్నై ఎయిర్ పోర్టులో ప్రకాష్ రాజ్ మరోసారి రెచ్చిపోయాడు అని వార్తలు వస్తున్నాయి. ఎయిర్ పోర్ట్ లో తనను చూసి ముచ్చట పడి సెల్ఫీ దిగాలని వచ్చిన ఒక అభిమాని పై తన ప్రతాపాన్ని చూపించాడు ప్రకాష్ రాజ్. 

అంతేకాదు సెల్ఫీ దిగాలనే యత్నం చేసిన ఆ అభిమాని నుండి సెల్ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టి ఆ అభిమానికి ప్రకాష్ రాజ్ షాక్ ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి.  దీనితో షాక్ అయిన ఆ అభిమాని విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేద్దామని ప్రయత్నిస్తే అప్పటికే ప్రకాష్ రాజ్ అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి మితిమీరిన ఆవేశం వల్లనే ఎంతో ప్రతిభ ఉన్న ప్రకాష్ రాజ్ ను ఇప్పుడు చాలామంది దర్శక నిర్మాతలు పక్కకు పెట్టేస్తున్నారు అన్న కామెంట్స్ ఉన్నాయి. ఏమైనా ఈ మోనార్క్ పద్ధతి ఇంతే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: