స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన తరువాత కొన్ని సీన్స్ లో నటించాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హీరో-హీరోయిన్స్ మధ్య జరిగే రొమాంటిక్ సీన్స్ అనేవి హీరోయిన్స్ ని కొంత ఇబ్బంది పెట్టే విషయాలుగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో హీరోయిన్స్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. హీరో ముద్దు సన్నివేశాలు కోరుకుంటే ఆ హీరో నిజ జీవితంలోనూ అలాంటి సుఖాన్ని కోరుకునే వాడా? లేదా? అనేది హీరోయిన్స్ చూస్తారంట.


ఒకవేళ తను రొమాంటిక్‌ సన్నివేశాల్లో యాక్టింగ్ చేయకుండా నిజంగానే రొమాన్స్ చేస్తాడా? అనే డౌట్స్ హీరోయిన్స్ కి వస్తాయంట. అయితే ఇన్ని అనుమానాలతో కన్ఫ్యూజన్ అయిన ఓ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనదైన జాగ్రత్తలను తీసుకుంటుందని అంటున్నారు. ఆ జాగ్రత్తలతో స్టార్ హీరోలకి చెమటలు పుట్టిస్తుందని అంటున్నారు. శ్రీలంక బ్యూటీ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తాజాగా తనకు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన అనుభవాల గురించి వివరించింది.


తను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరూ లిప్ లాక్ సీన్స్ కావాలని కోరుకున్నారంట. అయితే ఓ హీరో హెల్త్ పరంగా అన్ ఫిట్ అయినప్పటికీ తనకి లిప్ టాక్ ఇవ్వాల్సిందే అనే పంతం పట్టాడంట. దీంతో విసిగిపోయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్….ఆ హీరో చేత కొన్ని మెడికల్ టెస్ట్ లు చేయించి తను లిప్ లాక్ సీన్స్ కి అన్ ఫిట్ అంటూ తేల్చిందట.


అప్పటి నుండి తనతో లిప్ లాక్ సీన్స్ కోరుకునే హీరోలకి ఈ బ్యూటీ కొన్ని మెడికల్ టెస్ట్ లు తప్పకుండా చేయిస్తుందట. ఆ రిపోర్ట్స్ లో హెల్త్ పర్ఫెక్ట్ అయితే ఆ హీరోలతో ముద్దు పెట్టించుకోవటంలో ఏ మాత్రం ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. మొత్తంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పెట్టిన ఈ మెడికల్ లిప్‌ టెస్ట్ కి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని సగానికిపైగా హీరోలకి వణుకు వస్తుందని అంటున్నారు. ఇక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేతిలో ప్రస్తుతం 4 చిత్రాల వరకూ ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: