పవన్ నుంచి దూరం అయినా నిరంతరం ఏదో ఒక విషయంలో కామెంట్స్ చేస్తూ సందడి చేసే రేణు దేశాయ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఒక భర్తగా ఎంత వరకు విజయవంతం అయ్యాడు అన్న విషయమై మార్కులు వేసింది. ఎల్లుండి జరగబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది రేణు.

ఈ ఇంటర్వ్యూలో అనేక ప్రశ్నలకు చకచకా సమాధానాలు ఇచ్చింది రేణు. అయితే ఎక్కువగా ఆ ప్రశ్నలు అన్నీ పవన్ కళ్యాణ్ తో లింక్ అయి ఉండటం అందర్నీ ఆశ్చర్య పరిచింది. తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం మిలాన్ అని చెప్పిన రేణూ దేశాయ్. బాలు సినిమా షూటింగ్ సందర్భంగా అక్కడ ఎన్నో ప్రదేశాలను పవన్ కళ్యాణ్ తో కలిసి తిరిగినట్లు చెప్పింది. 

ఇక తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ తాను త్వరగా నిర్ణయాలు తీసుకుంటానని తన జీవితంలో పెళ్లి చేసుకోవడం అతి తొందరపాటు నిర్ణయంగా చెపుతూ కామెంట్స్ చేసింది రేణూ దేశాయ్. ఒక భర్తగా  పవన్ కు 4, 5 మార్కులే వేస్తానని అయితే తండ్రిగా మాత్రం 10 కి 100 మార్కులు ఫిలిం యాక్టర్ గా 10 కి 10 పొలీటీషియన్ గా 10 కి 10 మార్కులు వేస్తాను అని చెపుతూ రేణు దేశాయ్ పవన్ కు వేసిన మార్కులు అందర్నీ ఆశ్చర్య పరిచాయి.

ఇదే సందర్భంలో తన పిల్లల గురించి మాట్లాడుతూ తన కొడుకు అకీరాతో పవన్ సినిమాల్లో ఏదో ఒకదాన్ని రీమేక్ చేయాల్సి వస్తే ‘ఖుషీ’ మూవీని రీమేక్ చేస్తాను అంటూ తన మనసులోని ఆలోచనలు బయట పెట్టింది. అయితే పవన్ సినిమాల్లోంచి తాను ఒకటి తాను రీమేక్ చేసి నటించవలసి వస్తే మాత్రం ‘జానీ’ మూవీని ఎంచుకుంటాను అంటూ ఆ మూవీ పై తనకున్న ఇష్టాన్ని బయట పెట్టింది రేణు. 

రేణు దేశాయ్ ఈవిధంగా పవన్ కు మార్కులు వేస్తూ ఉంటే అందరికీ షాక్ ఇస్తూ ఈసారి విదేశాలలో జరుగుతున్న ‘కాటమరాయుడు’ పాటల చిత్రీకరణకు తన పద్ధతి భిన్నంగా పవన్ తన భార్య అన్నా ను అదేవిధంగా తన కూతురును తీసుకుని ఇటలీ వెళ్ళినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఒకవైపు రేణు దేశాయ్ పవన్ కు భర్తగా తక్కువ మార్కులు వేసిన నేపధ్యంలో పవన్ తన భార్య అన్నా ను కూతురును తీసుకుని విదేశాలకు వెళ్ళడం యాదృచ్ఛికం అనుకోవాలా ? అనుకోవాలా లేదంటే పవన్ తాను మంచి భర్తను అని చెప్పడానికి అనుకోవాలా ? అన్నదే సమాధానం లేని ప్రశ్న..  



మరింత సమాచారం తెలుసుకోండి: