కెరీర్ మొదట్లో వచ్చిన అతనొక్కడే సినిమా చూపించి నేనూ హీరోనే అని గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఇంతోటి హిట్ ఇచ్చిన కళ్యాణ్ రాముతో ఏ నిర్మాత సినిమా తీసేందుకు ముందుకు రాకపోవడంతో తానే నిర్మాతగా మారి సినిమాలు తీసుకుంటున్నాడు. కష్టపడే మనస్తత్వం ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో కళ్యాణ్ రామ్ కూడా ఒకరని అతని సినిమాలు హిట్ కాకపోయినా ఆ సినిమాల రూపకల్పన కోసం అతను పడే కష్టం, పోగొట్టుకొనే డబ్బులు చూస్తుంటే అనిపిస్తుంటుంది.


ఒకవైపు తన సినిమాలు హిట్ కాకపోయినా కళ్యాణ్ రామ్ ప్రయోగాలు చేయడంలో కూడా దిట్ట అని తాజాగా చేసిన 'ఓం' మూవీతో నిరూపించుకున్నాడు. కాకపోతే ఈ ప్రాజెక్టు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని కూడా విడుదలకు నోచుకోలేకపోతుంది. రిలీజ్ విషయంలో నిజంగా కళ్యాణ్ రామ్ సినిమా కష్టాలనే ఎదుర్కొంటున్నాడు.


ప్రయోగం అంటూ తన మార్కెట్ రేంజుని మరిచిపోయి మరి ఈ 3డి మూవీ కోసం అతిగా ఖర్చు పెట్టిన కళ్యాణ్ రామ్. మార్కెట్లో ఏ పెద్ద సినిమా లేకుండా ఉన్న సమయం చూసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ పాపం వరసగా వారానికో పెద్ద హీరో సినిమా ఎటాక్ కోసం రెడీగా ఉండటంతో ఏం చేయాలో తోచక ఓం విడుదల డేటుని ఇష్టం వచినట్లుగా మార్చేస్తున్నాడు. ఈ మార్పిడిని చూసిన ఇండస్ట్రీలో కొందరు పాపం కళ్యాణ్ రామ్ సినిమా కష్టాలను ఫేస్ చేస్తున్నాడురోయి అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: