తెలుగు ఇండస్ట్రీలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే దర్శకులు రాంగోపాల్ వర్మ.  గత కొంత కాలంగా బాలీవుడ్ వదిలి కోలీవుడ్ కి షిఫ్ట్ అయిన వర్మ కొన్ని సినిమాలు తీశారు. అందులో దాదాపుగా అన్నీ నిరాశపరిచినవే..అయితే ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమా తీస్తున్నాడు.  ఇక సోషల్ మీడియాలో ప్రతి ఒక్క అంశంపై తనదైన స్టయిల్ లో ట్విట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే వర్మ సినీ సెలబ్రెటీల గురించి కాసింత ఎక్కువగా వ్యంగాస్త్రాలు వేస్తుంటారు.  ఇక మెగా హీరోల విషయం లో ఐతే వర్మ నోటికి హద్దే ఉండదు.
Ram-Gopal-Varma-Comments-on-Pawan-Katamarayudu-Title-Song
ఆ మద్య పవన్ కళ్యాన్ గురించి చేసిన ట్విట్స్ వివాదం కాగా ఆయన ఫ్యాన్స్ చేసిన హంగామాకు నేను అసలు పవన్ విషయంలో జోక్యం చేసుకోను..అసలు మాట్లాడను అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పాడు.  కానీ ఆయనే ఎన్నో సందర్భాల్లో నేను అస్సలు మాట మీద నిలబడే మనిషిని కాదు అంటుంటారు..ఇప్పుడు అదే పవన్ విషయంలో కూడా జరిగింది.  తాజాగా పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమా పై ట్విట్స్ పెట్టాడు.  "మీర్రా మీర్రా మీసం" సాంగ్ రిలీజ్ కాగానే ఎప్పటిలాగే వర్మ సాంగ్ చాలా బాగుంది. సాంగ్ లో పవన్ కల్యాణ్ వ్యక్తిత్వానికి అద్దంపట్టేలా ఉంది అని ట్వీట్ చేశాడు.
Image result for ram gopal varma pawan
దీంతో పవన్ ఫ్యాన్స్ వర్మకు థ్యాంక్స్ చెప్పారు..ఇంతలో మనోడికి ఏమైందో ఏమో కానీ..తన వ్యంగాస్త్రాన్ని మరోసారి ప్రయోగించారు.  సాంగ్ చాలా బాగుంది పవన్ కల్యాణ్ టోన్ బాగుంటుంది.. సో ఆ సాంగ్ ను పవన్ కల్యాణ్ పాడితే ఇంకా బాగుండేది అని వెటకారం చేస్తూ మళ్ళీ ట్వీట్ చేశాడు. దీంతో పవన్  ఫ్యాన్స్ ఒక్క సారే ఉగ్రరూపం దాల్చి వర్మ ని ఏకేశారు.. దీంతో వెంటనే పవన్ కల్యాణ్ సాంగ్ పై తాను పెట్టిన ట్విట్స్ ను డిలీట్ చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: