తెలుగు ఇండస్ట్రీలోకి ‘సూపర్ ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నటి అనుష్క.  తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటించి తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది.   ఇక ఇండస్ట్రీలో అనుష్క కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా ప్రయోగాత్మక పాత్రల్లో నటించి అందరినీ ఆకర్షించింది.   అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి చిత్రాలో అద్భుతమైన నటన ప్రదర్శంచి విమర్శకుల చే ప్రశంసలు పొందింది.  ఇక బాహుబలి చిత్రంలో అనుష్క పాత్ర చిన్నదే అయినా డి గ్లామర్ గా కనిపించింది.

Image result for baahubali 2 new posters

 జేజమ్మా అంటూ కత్తి పట్టినా… బిల్లా అంటూ బికినీ అందాలతో అదరగొట్టినా అనుష్కకే చెల్లింది. అయితే అలాంటి అనుష్కను ముసలమ్మలా తయారు చేశాడు రాజమౌళి.  తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా హిందీ, తమిళ ఇండస్ట్రీలో కూడా దుమ్మురేపింది బాహుబలి.  ఇక ఈ చిత్రంలో అందరి క్యారెక్టర్లు ఒకలా తీర్చిదిద్దితే..అనుష్కను మాత్రం డీ గ్లామర్ గా చూపించారు.  బాహుబలిలో అనుష్క చూసిన ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. ఇందులో చెరశాలలో బంధీగా కనిపించింది అనుష్క. కాస్త మిడిల్ ఏజ్ క్యారెక్టర్. అయితే భయంకరమైన మేకప్ వేశారు.
Related image
టోటల్ గా బాహుబలిలో ముసలి అనుష్కతోనే సరిపెట్టేశారు. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2రెడీ అవుతోంది. ఒకొక్క పోస్టర్ బయటికివస్తోంది. ఇదివరకే అనుష్క సంబధించిన యంగ్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఇందులో అనుష్క ను టెక్నాలజీ వాడి సన్నగా చూపించారు.  తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు..ఈ పోస్టర్ చూస్తే అనుష్క మరోసారి  ఓల్డ్ గెటప్ మరీ భయంకరంగా వుంది...తలపై నిప్పు కుంపటి ఒకటి పెట్టారు. తన అందాలతో అందరి మనసు దోచిన ముద్దుగుమ్మ అనుష్క బాహుబలి 2 లో అందంగా చూపిస్తారా..మరి ట్రైలర్ చూస్తే కాని తెలియదు. 

Image result for baahubali 2 devasena


మరింత సమాచారం తెలుసుకోండి: