వ‌రుస ఫ్లాపుల‌తో.. త‌న ఇమేజ్‌ని డామేజ్ చేసుకొన్నాడు గుణ‌శేఖ‌ర్‌. వ‌రుడు, నిప్పు సినిమాలు డిజాస్ట‌ర్ కావ‌డంతో - గుణ‌శేఖర్ తో సినిమాలు చేయ‌డానికి ఒక్క‌రూ ముందుకు రావ‌డం లేదు. ఈ స‌మ‌యంలో త‌న కెరీర్‌లోనే అతి పెద్ద సాహ‌సం చేస్తున్నాడు. రాణి రుద్ర‌మతో. ఇది గుణ‌శేఖ‌ర్ క‌ల‌ల సినిమా. ద‌ర్శ‌క‌త్వంతో పాటు, నిర్మాణ బాధ్య‌త‌లూ నెత్తిమీద వేసుకొన్నాడు.

ఇప్ప‌టికే భారీ తారాగ‌ణంతో సినిమాని నింపేశాడు. పేరున్న సాంకేతిక నిపుణుల‌ను పెట్టుకొన్నాడు. ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా... భారీ ఎత్తున ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమా కోసం అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతున్నాడు. భారీ సెట్‌లు వేయించాడు. ఇప్పుడు రుద్ర‌మ‌దేవి ఆభ‌ర‌ణాల కోసం ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చుపెట్టాడు. ఈ సినిమాలో అనుష్క నిజ‌మైన బంగారు ఆభ‌ర‌ణాల‌తో క‌నిపిస్తుంద‌ట‌. వాటికి రూ.5 కోట్లు ఖర్చు చేశాడ‌ట‌. జోథా అక్బ‌ర్‌లో ఐశ్వ‌ర్యరాయ్ ఆభ‌ర‌ణాల‌కు ఎంత క్రేజ్ వ‌చ్చిందో ఈసినిమాలో అనుష్క ఆర్న‌మెంట్స్‌కి అంత గుర్తింపు వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది.

��

 గుణ‌శేఖర్ శ్ర‌మని త‌క్కువ చేయ‌కూడ‌దు గానీ - ఈ సినిమాని ఇంత ఆర్భాటం అవ‌స‌ర‌మా అనిపిస్తోంది. లో ప్రొఫెల్ లో ఓ యావ‌రేజ్ సినిమా తీసినా జ‌నం హ‌ర్షిస్తారు. ఇంత బిల్డ‌ప్పులిచ్చి మామూలు సినిమా తీస్తే న‌వ్విపోతారు. ఆభ‌ర‌ణాల‌కు అంత ఖ‌ర్చు పెట్ట‌డం అవ‌స‌ర‌మా?  డూప్లికేట్ ఆభ‌ర‌ణాలు వాడితే ఆ ఫీల్ రాదా??  అనేదే అస‌లు ప్ర‌శ్న‌. ఈ శ్ర‌ద్ద‌.. సినిమా మేకింగ్‌పై పెడితే మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయి క‌దా??

మరింత సమాచారం తెలుసుకోండి: