బాలీవుడ్ లో ఎన్నో హిస్టారికల్ చిత్రాలు తీసిన సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పద్మావతి. పిరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి అన్నీఅరిష్టాలే జరుగుతున్నాయి.  ఆ మద్య  జైపూర్‌లోని జైగఢ్ కోటలో చిత్రీకరణ జరుపుకుంటుండగా చరిత్రకు విరుద్ధంగా సినిమా తీస్తున్నారని దర్శకుడిపై రాజ్‌పుత్‌కు చెందిన కర్ణిసేన కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ చేస్తున్న ప్రదేశం వద్ద వారు గందరగోళం సృష్టించడంతో షూటింగ్ ని కొన్నాళ్ళు పెండింగ్ లో పెట్టారు.

తాజాగా ‘పద్మావతి’ చిత్ర సెట్‌ను కొందరు దుండగులు దహనం చేశారు.  ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ‘పద్మావతి’ షూటింగ్‌ కొల్హాపూర్‌లో జరుగుతోంది. ఐతే, మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఆ ప్రాంతానికి 40 మందికి పైగా దుండగులు వచ్చి సెట్స్‌పై పెట్రోల్ బాంబులు విసిరి, రాళ్లతో దాడి చేశారు. షూటింగ్ కోసం తీసుకొచ్చిన హార్స్ ఈ ఘటనలో గాయపడింది.

చిత్ర బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కొందరు అనుమానితుల్ని అరెస్టు చేశారు.   నిప్పంటించడానికి ముందు అక్కడి కార్లను కూడా ధ్వంసం చేశారు. చిత్ర బృందం నుంచి బుధవారం ఉదయం ఫిర్యాదు అందుకున్న పోలీసులు కొందరు అనుమానితుల్ని అరెస్టు చేశారు.  అయితే ఈ దాడిలో ఎవరు గాయపడలేదని తెలుస్తున్నది. పద్మావతి షూటింగ్ మొదలైనప్పటి నుండి ఇలా దాడి చేయడం రెండో సారి కాగా ప్రస్తుతం యూనిట్ అంతా షాక్ లో ఉంది.

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంగా తెరకెక్కుతున్న పద్మావతి చిత్రంలో రాణి ప‌ద్మావ‌తిగా దీపికా ప‌దుకొనే న‌టిస్తోండగా అల్లావుద్దీన్ ఖిల్జీగా నెగ‌టివ్ రోల్‌లో ర‌ణ్‌వీర్‌సింగ్ క‌నిపించ‌నున్నాడు. రాజా రావ‌ల్ ర‌త‌న్ సింగ్‌ పాత్రను షాహిద్ క‌పూర్‌ పోషిస్తున్నాడు. అయితే చరిత్రను వక్రీకరిస్తున్నారనే భావనతో ఇలాంటి దాడులు జరుపుతున్నారేమోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: