పవన్ కళ్యాణ్ ను ఇష్టపడుతున్న వ్యక్తుల్లో నేను ఒకడిని.. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోశించిన పాత్ర ఏంటో అందరికి తెలుసు.. మరొకరైతే అందుకు గాను పదవి పొందడమో.. లేదా డబ్బు సంపాదించడమో.. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లా బాగా డబ్బు సంపాదించడమో చేసేవారు. కాని పవన్ కళ్యాణ్ అలా చేయకుండా ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారని అన్నారు టివి9 రవిప్రకాష్. 


అసలైన ప్రజల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ తన శక్తి మేరకు కృషి చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ను కచ్చితంగా అభిమానించాల్సి ఉంటుంది. అంతేకాదు కొత్త సంస్కృతికి పవన్ కళ్యాణ్ తెర లేపడం జరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారికి ప్రభుత్వంలో ఉన్న వారికి కేవలం భజన చేసే బ్యాచ్ కనబడుతుంది. చాలా కష్టమైన విషయం నిజం మాట్లాడటం.. సత్యం వెనుక నిలబడటం.. సత్యాన్ని గట్టిగా చెప్పడం.. ఆ పని చేస్తున్న పవన్ కళ్యాణ్ కు నా అభినందనలు అన్నారు. 


ప్రత్యేకహోదా ఇస్తామని ఆశ పెట్టిన సందర్భంలో.. డీమానిటైజేషన్ తో ప్రజల జీవితాలను రోడ్ల పాలు చేసిన సమయంలో కావొచ్చు.. ప్రతి ఒక్కరు మీడియా కూడా మాట్లాడటానికి సైలెంట్ గా ఉన్న సమయంలో ప్రశ్నించడానికి ముందుకొచ్చి ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్. యువతరం ప్రశించాల్సి ఉంది.. నిలదీయాల్సి ఉంది.. ప్రజల కోసం పనిచేయాల్సిన రాజకీయ నాయకులు ఆస్తులు కూడబెట్టుకోవడం సరిపోతుంది. ఎన్నికల ముందు ఓ మాట ఎన్నికల తర్వాత ఓ మాట చెప్పి ప్రజలని మోసం చేస్తున్నారని అన్నారు.  


ప్రశ్నించే చైతన్యాన్ని తెలుగు యువతలో తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ కు అభినందనలు.. ఇలానే పవన్ తన ప్రయత్నాన్ని మరింత ముందుకు సాగించాలని తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత ముందుకు వెళ్లాలని పవన్ స్పూర్తితో యువత కూడా అతనితో అడుగులేయాలని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ స్పీచ్ ముగించారు టివి 9 సి.ఈ.ఓ రవి ప్రకాశ్.  



మరింత సమాచారం తెలుసుకోండి: