గత వారం విడుదలైన ‘కాటమరాయుడు’ టాక్ తో సంబంధం లేకుండా ఈ మూవీ నిన్నటితో ముగిసిన వీకెండ్ కు 35 కోట్ల నెట్ కలక్షన్స్ మన తెలుగు రాష్ట్రాల నుంచి రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  దీనితో ఈరోజు నుంచి ‘కాటమరాయుడు’ కు అసలు పరీక్ష మొదలు అయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

వాస్తవానికి ఎల్లుండి ఉగాది పండుగ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉన్న నేపధ్యంలో ‘కాటమరాయుడు’ రాబోతున్న ఉగాది పండుగను తన కలక్షన్స్ ను మరింత పెంచుకోవడానికి ఎంత వరకు ఉపయోగించుకో గలుగుతుంది అన్న అంచనాలు ఎవరికీ అర్ధం కాని విషయంగా మారింది. అయితే ఈసినిమా ప్రమోషన్ విషయంలో పవన్ ఏమాత్రం శ్రద్ధ పట్టని నేపధ్యంలో ఏదైనా అద్భుతం జరిగితే కాని ఈవారం ‘కాటమరాయుడు’ గట్ట ఎక్కడం అసాధ్యం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీనికితోడు ‘కాటమరాయుడు’ ని లెక్క చేయకుండా ఈ నెల 31న వెంకటేష్ ‘గురు’ అదేవిధంగా పూరిజగన్నాథ్ ‘రోగ్’ తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడ విడుదల అవుతున్న నేపధ్యంలో ఇప్పటికే డివైడ్ టాక్ ను ఎదుర్కుంటున్న ‘కాటమరాయుడు’ కు మరిన్ని కష్టాలు ఎదురయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ‘కత్తి’ రీమేక్ ను నమ్ముకుని చిరంజీవి రికార్డులు సృష్టిస్తే ‘వీరం’ రీ మెక్ ను నమ్ముకుని పవన్ లేనిపోని పరాభవాన్ని మూట కట్టుకున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనితో దాదాపు 9 సంవత్సరాల గ్యాప్ తరువాత ఒక రీమేక్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవికి తెలిసిన టెక్నిక్ పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకోలేకపోయాడు అన్న సెటైర్లు కూడ కొంతమంది పవన్ వ్యతిరేకులు పవన్ పై వేస్తున్నారు. ఏది ఎలా చూసుకున్నా పవన్ మితిమీరిన ఆత్మ విశ్వాసం కాటమరాయుడు ను దెబ్బ తీసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: