తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అంటే వెంటనే గుర్తుకు వచ్చేది..శోభన్ బాబు. తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసింది జగపతిబాబు మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు.  హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విలన్ అవతారం ఎత్తాడు.  ఇప్పుడు విలన్ గా యంగ్ హీరోలకు ధీటుగా నటిస్తూ బాగా బిజీ అయ్యారు.  తెలుగు, తమిళ, మళియాల ఇండస్ట్రీలో ప్రస్తుతం జగపతిబాబు చేతినిండా సినిమాలు ఉన్నాయి. ‘లెజెండ్’ సినిమాతో స్టైలిష్ విలన్ కనిపించిన జగ్గూబాయ్ హీరోగా ఉన్నప్పటికన్నా ఎక్కువ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి.

అలాంటి జగపతి మళ్ళీ ఇప్పుడు హీరోగా మారి ‘పటేల్ ఎస్.ఐ.ఆర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై నూతన దర్శకుడు వాసు పరిమి డైరెక్ట్ చేస్తున్నాడు.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఒకటి రిలీజ్ అయ్యింది..ఇందులో జగ్గూబాయ్ చాలా డిఫరెంట్ స్టైల్ గా కనిపిస్తున్నాడు.  ఒంటిపై టాటూస్ తో షర్ట్ లేకుండా కనిపిస్తున్నాడు. అయితే ఈ టీజర్ లో ఓ చిన్నపాపతో కనిపిస్తున్న జగ్గుబాయ్ ఇందులో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో త్వరలో తెలియాల్సి ఉంది.

 ఈ చిత్రంతో జగపతి నటుడిగా మరొక మెట్టు ఎదగడం ఖాయమనే స్పందన కూడా వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకానుంది. వారాహి చలన చిత్రం బేనర్‌పై సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రంకు శ్యామ్ కె నాయుడు ఫోటోగ్రఫీ అందించనుండగా, డీజే వసంత్ సంగీతం అందిస్తున్నారు,  రాజమౌళి కొడుకు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: